Advertisementt

టాలీవుడ్ లో లేకపోయినా.. తమిళ్ లో

Wed 12th May 2021 05:56 PM
rajasekhar,daughter,shivani rajsekhar,udhayanidhi,article 15 remake  టాలీవుడ్ లో లేకపోయినా.. తమిళ్ లో
Shivani Rajsekhar joins Article 15 remake టాలీవుడ్ లో లేకపోయినా.. తమిళ్ లో
Advertisement
Ads by CJ

తెలుగు హీరోయిన్స్ కి తెలుగులో ఫ్యూచర్ ఉండదు అనేది తెలుగు హీరోయిన్స్ అపోహ మాత్రమే కాదు. నిజంగానే తెలుగు హీరోయిన్స్ కి తెలుగులో సినిమా అవకాశాలు ఉండవు.. కాబట్టే పక్క భాషలకి పోయి టాలెంట్ ని నిరూపించుకుంటారు. స్వాతి, బిందు మాధవి, రీసెంట్ గా రీతూ వర్మ తెలుగులో హిట్ కొట్టిన తర్వాత తమిళంలోకి వెళ్ళింది. మళ్ళి ప్రస్తుతం తెలుగులో అవకాశాలు పట్టేస్తుంది. ఈషా రెబ్బ అంతే తెలుగులో అవకాశాలు రావడం లేదు. గ్లామర్ డోస్ పెంచినా ఈషా రెబ్బ కి అవకాశాలు నిల్. ఇక ఇప్పుడు మరో కొత్త హీరోయిన్ కూడా తెలుగులో అవకాశాలు దొరక్క తమిళ్ లో బిజీ అవుతుంది. ఆమె ఎవరో కాదు. ఈమధ్యనే తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన హీరో రాజశేఖర్ కూతురు శివానీ రాజశేఖర్‌. ఆమె తెలుగులో అడివి శేష్ తో చేసిన మూవీ ఆగిపోయింది. 

గుహన్ దర్శకత్వంలో డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ లో నటిస్తుంది. అలాగే తమిళ్ లో కాస్త బిజీ అయిన శివాని అన్బరివ్‌ అనే తమిళ చిత్రంలో నటిస్తుంది. ఇప్పుడది ఇంకా షూటింగ్ సెట్స్ లో ఉండగానే శివాని మరో తమిళ ఆఫర్ పట్టేసింది. అదే బాలీవుడ్ లో హిట్ అయిన ఆర్టికల్ 15 మూవీని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఆర్టికల్ 15 ని తమిళంలో బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్‌ తమిళంలో రీమేక్ చేస్తున్నారు. ఉదయనిధి స్టాలిన్‌ హీరోగా తాన్యా రవిచంద్రన్ హీరోయిన్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో శివాని మరో హీరోయిన్ గా ఎంపికైనట్లు తెలుస్తుంది. ప్రస్తుతం చిన్నపాటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ రీమేక్ సెకండ్ షెడ్యూల్ లో శివాని కూడా జాయిన్ అవ్వబోతున్నట్లుగా తెలుస్తుంది. 

Shivani Rajsekhar joins Article 15 remake:

Rajasekhar daughter Shivani Rajsekhar joins Udhayanidhi Article 15 remake

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ