Advertisementt

15 డేస్ తర్వాత పిల్లలతో అల్లు అర్జున్

Wed 12th May 2021 01:08 PM
allu arjun,meets kids,testing,covid negative,big hug,bunny,allu arjun family  15 డేస్ తర్వాత పిల్లలతో అల్లు అర్జున్
Allu Arjun meets kids after testing Covid negative 15 డేస్ తర్వాత పిల్లలతో అల్లు అర్జున్
Advertisement
Ads by CJ

కరోనా మహమ్మారి పిల్లలని తల్లితండ్రులకి కాకుండా చేస్తుంది, ఫ్రెండ్స్ కానివ్వండి, చుట్టాలు కానివ్వండి., పేరెంట్స్, పిల్లలు ఇలా ఎవరికీ కరోనా సోకినా.. ఒంటరి జీవితం, ఒకవేళ కరోనాతో కన్ను మూస్తే మోసేవాళ్ళు నలుగురు పక్కబెట్టి.. ఓదార్చే వారు లేక కుటంబాలు రోడ్డు మీద దిక్కుతోచని పరిస్థితిల్లో కనిపిస్తున్నాయి. తండ్రి, తల్లి మరణించినా కొడుకు, కూతుళ్లకు హాస్పిటల్ లో ఉండడం.. వారిని కాటికి తీసుకువెళ్ళేవారు లేక అనాథ శవాలుగా మారిపోవడం రోజు వేలల్లో నిత్యం మీడియాలో చూసి తెలుసుకుంటూనే ఉన్నాము. తాజాగా అల్లు అర్జున్ కరోనా బారిన పడి ఓ 15  రోజులు ఫ్యామిలీ దూరంగా తనని  తాను ఓ గదిలో బందించుకోవాల్సి రావడం.. ఇంట్లోనే ఉండి ఫ్యామిలీని కలవలేకవడం అల్లు అర్జున్ ని ఎమోషనల్ గా మార్చేసింది.

ఒకవేళ షూటింగ్ ఉండి నెలలు నెలలు ఫ్యామిలీని కలవకపోయినా అది వేరే విషయం. కానీ ఒకే ఇంట్లో ఉండి పిల్లల్ని, భార్య, పేరెంట్స్ ని కలవలేకపోవడం ఎంత నరకమో అందరికి తెలుసు. ఇక అల్లు అర్జున్ 15 రోజుల క్వారంటైన్ ముగించుకుని తన పిల్లలని కలుసుకున్న వేళ.. ఎలా ఉందొ ఓ వీడియో రూపంలో అభిమానులకి చూపించాడు అల్లు అర్జున్. Meeting family after testing negative and 15 days of quarantine. Missed the kids soo much. అంటూ వీడియోని షేర్ చేసాడు. అల్లు అర్జున్ లిఫ్ట్ దిగి రాగానే అయాన్ అమాంతం బన్నీ ని చుట్టేశాడు. ఐ యాం టెస్ట్స్ నెగటివ్ అంటూ పిల్లలని గుండెలకి హత్తుకున్నాడు. అయాన్ తర్వాత అర్హ తండ్రి చేతిలో ఒదిగిపోయి అల్లరి చేసిన వీడియో ఇప్పుడు సాంఘీక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

Allu Arjun meets kids after testing Covid negative:

Allu Arjun meets kids after testing Covid negative, gives them a big hug

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ