దేశం మొత్తం లాక్ డౌన్, కర్ఫ్యూలతో తాళం పడగా.. సినిమా ఇండస్ట్రీ కూడా సైలెంట్ అయ్యింది. అయితే లాక్ డౌన్ వలన ప్రజలంతా ఆర్ధికంగా నష్టపోతున్నారు. సన్న చిన్న తరహా పరిమిశ్రమాలన్ని తాళం పడడంతో వలస కార్మికులు సొంతూళ్లకు తరలి పోతున్నారు. లాక్ డౌన్ వలన దేశం మొత్తం ఆర్ధికంగా నష్టపోతోంది. కానీ ఈ లాక్ డౌన్ కొంతమందికి మాత్రం బాగా కలిసొస్తుంది. అది యూట్యూబ్ ఛానల్స్ కి, టిక్ టాక్ స్టార్స్ కి, వెబ్ సీరీస్ లు చేసేవారికి. టిక్ టాక్ అనేది ఇంట్లో కూర్చుని అయినా చేసి కంప్యూటర్ నుండి అప్ లోడ్ చెయ్యొచ్చు. అలాగే యూట్యూబ్ ఛానల్స్ లో ఏ సీరియల్ స్టార్ నో పట్టుకొచ్చి ఇంటర్వ్యూ చేసినా లక్షల్లో వ్యూస్ వస్తాయి.
అలాగే వెబ్ సీరీస్ లు చేసే వారికీ ఈ లాక్ డౌన్ బాగా కలిసొస్తుంది. యూత్ మొత్తం పనులు లేక చేతిలో ఫోన్ పెట్టుకుని యూటుబ్స్, టిక్ టాక్స్, వెబ్ సీరీస్ చూస్తూ గడిపేస్తున్నారు. కేవలం యూట్యూబ్ మాత్రమేనా గృహిణులు చేతిలోనూ ఫోన్.. అందులో యూట్యూబ్, సోషల్ మీడియానే. ఆఫీస్ లు లేక బోర్ కొట్టే వారు, విలేజ్ ప్రజలు అంతా ఇప్పుడు యూట్యూబ్ యూట్యూబ్ అంటున్నారు. మరి లాక్ డౌన్ లో ఎవరెలా ఉన్నా ఈ యూట్యూబెర్స్ కి మంచి లాభాలు రావడం గ్యారెంటీ.