Advertisementt

సీనియర్ హీరోయిన్ కోసం వెతుకులాట

Thu 20th May 2021 02:56 PM
trivikram,mahesh babu,ssmb28,senior heroine,trivikram - mahesh combo,ssmb 28 movie  సీనియర్ హీరోయిన్ కోసం వెతుకులాట
Trivikram looking out for that role again సీనియర్ హీరోయిన్ కోసం వెతుకులాట
Advertisement
Ads by CJ

త్రివిక్రమ్ తన సినిమాల్లో సీనియర్ హీరోయిన్స్ కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వడం చూస్తూనే ఉన్నాం. జల్సా అప్పుడు పార్వతి మెల్టన్ ని ఏరుకొచ్చిన త్రివిక్రమ్, సన్ అఫ్ సత్యమూర్తి కోసం తమిళ నటి స్నేహ ని, అత్తారింటికి దారేది కోసం నదియాని, అజ్ఞాతవాసి కోసం ఖుష్బూ, అరవింద సమేత కోసం దేవయాని, రీసెంట్ మూవీ అలా వైకుంఠపురములో మూవీ కోసం టబుని ఇలా తన సినిమాల్లో అలనాటి తారాలని భాగం చేస్తుంటాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. అయితే ఇప్పుడు మహేష్ తో చెయ్యబోయే మూవీ కోసం కూడా త్రివిక్రమ్ మరో సీనియర్ హీరోయిన్ వేటలో ఉన్నాడనే టాక్ వినిపిస్తుంది. మహేష్ ని స్టోరీ లైన్ తో మెప్పించిన త్రివిక్రమ్ ఈ సెకండ్ వేవ్ టైం లో పూర్తి కథని సిద్ధం చెయ్యడమే కాదు.. హీరోయిన్, కీలక పాత్రలకు నటుల్ని ఎంపిక చేసేపనిలో ఉన్నాడట.

ఇక టెక్నీకల్ గా మ్యూజిక్ డైరెక్టర్ గా థమన్ నే త్రివిక్రమ్ చూజ్ చేసుకుంటాడని.. ఒకవేళ మహేష్ గనక దేవిని సజెస్ట్ చేస్తే గనక ఆలోచిస్తాడట. మరి టెక్నీకల్ గ మోస్ట్లీ అలా వైకుంఠపురములో టీమ్ నే రిపీట్ చెయ్యబోయే త్రివిక్రమ్ మహేష్ కోసం హీరోయిన్ గా పూజ హెగ్డే ని ఎంపిక చేసాడనే టాక్ ఉంది. కాకపోతే సీనియర్ హీరోయిన్ విషయంలో కాస్త గట్టిగానే సెర్చ్ చేస్తున్నాడట. అలాగే ఈ సినిమాలో మరో హీరో కూడా ఉండబోతున్నాడనే టాక్ ఉండనే ఉంది. మరి ఆ పాత్రకి ఎవరిని సెలెక్ట్ చేస్తాడో కానీ, ప్రస్తుతం అయితే త్రివిక్రమ్ మహేష్ తో చెయ్యబోయే సినిమా కోసం ఆ సీనియర్ హీరోయిన్ గురించే ఆలోచిస్తున్నట్టుగా ఫిలింసర్కిల్స్ లో వినిపిస్తున్నమాట.

Trivikram looking out for that role again:

Senior Heroine in Trivikram - Mahesh SSMB 28

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ