Advertisementt

తెలంగాణలో లాక్ డౌన్ పెట్టిన గంటలోపే..

Tue 11th May 2021 05:58 PM
lockdown effect,telangana,wines shops  తెలంగాణలో లాక్ డౌన్ పెట్టిన గంటలోపే..
10 day lockdown in Telangana from tomorrow తెలంగాణలో లాక్ డౌన్ పెట్టిన గంటలోపే..
Advertisement
Ads by CJ

కరోనా ఉధృతిని తగ్గించే ప్లాన్ లో భాగమే లాక్ డౌన్. లాక్ డౌన్ అంటే ఏమిటి.. ప్రభుత్వం ఇచ్చిన పరిధిలోనే పనులు ముగించుకుని.. మిగతా టైం లో బయటికి రాకుండా ఎవరి ఇంట్లో వారు ఉండడమే. సెకండ్ వేవ్ ఉధృతిలో పలు రాష్ట్రాల్లో లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. అయితే కాస్త లేట్ గా తెలంగాణ సర్కారు లాక్ డౌన్ విధించింది. రేపు 10 గంటల నుండి మరో పది రోజుల పాటు లాక్ డౌన్ విధిస్తున్నట్టుగా అనౌన్స్ చేసింది. ఉదయం ఆరు గంటల నుండి ప్రతి రోజు ఉదయం 10 గంటల వరకు దుకాణాలు, నిత్యావసరాల కోసం మాత్రమే ప్రజలు రోడ్డు మీదకి రావాలని.. ఆంక్షలు మీరితే కఠిన చర్యలని ప్రకటించింది.

తెలంగాణ ప్రభుత్వం లాక్ డౌన్ పెట్టిన గంటలోపే.. మందుబాబులు మద్యం దుకాణాల ముందు బారులు తీరారు. బారులు తీరడం కాదు గుంపులు గుంపులుగా మాస్క్ లు కానీ, సామజిక దూరం కానీ పాటించకుండా వైన్ షాప్ లకి పోటెత్తారు. హైదరాబాద్ సహా తెలంగాణ వ్యాప్తంగా మద్యం దుకాణాల ముందు మద్యం బాబులు చేసిన హడావిడి సోషల్ మీడియాలో వీడియోస్ రూపంలో చక్కర్లు కొడుతున్నాయి. మద్యం షాప్స్ ముందు కిలోమీటర్ల మేర మద్యం బాబులు బారులు తీరారు. తమదగ్గర ఉన్న డబ్బుతో దొరికిన మద్యాన్ని కొనుక్కుని ఇళ్ళకి వెళుతున్నారు. కరోనా కట్టడికి లాక్ డౌన్ అంటుంటే.. ఇలా మందు బాబుల కట్టడికి కూడా ప్రభుత్వం ఏమైనా చర్యలు చేపడితే కరోనాని మరింత ముందుగా అరికట్టవచ్చు.

10 day lockdown in Telangana from tomorrow:

Lockdown Effect in Telangana Wines Shops

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ