సీనియర్ హీరో వెంకటేష్ హిట్స్ - ప్లాప్స్ లతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తుంటారు. అంతేకాదు.. టాలీవుడ్ సీనియర్ హీరోల్లో రీమేక్ రాజాగా వెంకీకి పేరుంది. కారణం వెంకటేష్ ఎక్కువగా రీమేక్ లే చేస్తుంటాడు. రీసెంట్ గా కూడా నారప్ప, దృశ్యం 2 మూవీస్ రీమేక్స్ పూర్తి చేసి థియేటర్స్ ఓపెన్ అయితే రిలీజ్ ల కోసం వెయిట్ చేసున్నాడు. ఇక ఎఫ్ 3 షూటింగ్ లో పాల్గొందామన్నా ప్రస్తుతం సెకండ్ వెవ్, లాక్ డౌన్ తో ఎఫ్ 3 షూటింగ్ కి బ్రేకిచ్చారు. అయితే వేంకటేష్ తన సినిమాలు హిట్ అయినా ప్లాప్ అయినా ఒకేలా ఉండాలంటున్నారు. అది కొద్దిమందికే సాధ్యమైనా.. అందులో వెంకీ కూడా ఉంటారట.
పర్సనల్ లైఫ్ లోనూ, సినిమాల విషయంలోనూ మూడు సూత్రాలు ఉంటాయని అందులో ఒకటి పనిచేయడం, రెండు.ఫలితం గురించి ఆలోచించకుండా ఉండటం, మూడు ఆ తర్వాత ఫలితం ఎలాంటిదైనా స్వీకరించడం. మనం నటించిన సినిమా ప్లాప్ అవగానే మన పని అయ్యిపోయిందనే భయం పట్టుకుంటుంది. హిట్ అయితే మనమే తోపు అనే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అవి రెండూ మంచివి కావు. అందుకే సినిమా చివరి ఆఖరు అంకానికి చేరుకున్నప్పుడే.. నేను మానసికంగా దాని నుండి బయటికి వచ్చేస్తాను. ఆ తర్వాత నా నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి ఆలోచిస్తాను. అందుకే నేను హిట్ అయినా, ప్లాప్ అయినా నేను నేనులా ఉంటాను. అవి నన్ను ఎప్పుడూ మార్చలేకపోయాయి అంటూ సినిమాల విషయంలో తాను పాటించే మూడు సూత్రాలని ఒకొనొక సందర్భంలో తెలియజేసాడు వెంకీ.