Advertisementt

ఎన్టీఆర్ బర్త్ డే కి RRR రిలీజ్ డేట్

Tue 11th May 2021 05:11 PM
rrr movie,rrr release date,announcement,ntr birthday,rajamouli  ఎన్టీఆర్ బర్త్ డే కి RRR రిలీజ్ డేట్
Rajamouli To Announce RRR New Release Date on NTR Birthday? ఎన్టీఆర్ బర్త్ డే కి RRR రిలీజ్ డేట్
Advertisement
Ads by CJ

RRR హీరో ఎన్టీఆర్ బర్త్ డే కి డేట్స్ కౌంట్ చేసుకుంటున్నారు ఎన్టీఆర్ ఫాన్స్. తారక్ కి తాజాగా కరోనా పాజిటివ్ రావడంతో ఆయన హోమ్ ఐసోలేషన్ లోనే ఉంటున్నట్టుగా, డాక్టర్స్ ట్రీట్మెంట్  తీసుకుంటున్నట్టుగా, ఫాన్స్ ని కూడా కంగారు పడొద్దని చెప్పాడు. అయినప్పటికీ ఎన్టీఆర్ ఫాన్స్ కాస్త ఆందోళనగానే ఉన్నారు. ఎన్టీఆర్ పుట్టిన రోజు టైం కి ఎన్టీఆర్ కోలుకుంటాడని.. ఫాన్స్ నమ్మకంగా ఉన్నారు. ఆర్.ఆర్.ఆర్ నుండి ఎన్టీఆర్ బర్త్ డే కి ట్రీట్ గ్యారెంటీ అనుకుంటున్నారు ఫాన్స్.

ఆర్.ఆర్.ఆర్ టీం ఇప్పుడు ఎన్టీఆర్ బర్త్ డే రోజున మరో సర్ప్రైజ్ ప్లాన్ చేసిందట. ప్రస్తుతం పరిస్థితుల దృష్ట్యా ఆర్.ఆర్.ఆర్ ని అనుకున్న టైం కి అంటే అక్టోబర్ 13 న రిలీజ్ చెయ్యడం కుదరదు. కాబట్టి ఆర్.ఆర్.ఆర్ డేట్ మారవచ్చని అంటున్నారు. అయితే మార్చబోయే డేట్ ని ఎన్టీఆర్ బర్త్ డే రోజున ఓ స్పెషల్ పోస్టర్ తో అనౌన్స్ చేయబోతున్నారనే న్యూస్ సోషల్ మీడియాలో వినిపిస్తుంది. పాన్ ఇండియా మూవీ, ముందుగానే రిలీజ్ డేట్ లాక్ చేసుకోవాలి కాబట్టి.. ఆర్.ఆర్.ఆర్ టీం ముందుగా మరో రిలీజ్ డేట్ ని ప్లాన్ చేసి పెట్టి ఎన్టీఆర్ బర్త్ డే అకేషన్ కి అనౌన్స్ చెయ్యబోతుందట.

Rajamouli To Announce RRR New Release Date on NTR Birthday?:

RRR new release date announcement on NTR birthday

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ