దేశం వ్యాప్తంగా కర్ఫ్యూ లాక్ డౌన్స్ తో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా కట్టడి చర్యలు తీసుకుంటున్నాయి. లాక్ డౌన్ తో కరోనా కేసులు తగ్గించవచ్చని, అందుకే లాక్ డౌన్ అనివార్యమైనా ఇప్పటివరకు తెలంగాణ సీఎం కేసీఆర్ లాక్ డౌన్ పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. లాక్ డౌన్ వలన ప్రజలు నష్టపోతున్నారని.. మా రాష్ట్రంలో లాక్ డౌన్ పెట్టబోమని చాలాసార్లు చెప్పిన కేసీఆర్ ఆఖరికి హై కోర్టు అక్షింతలతో దిగిరాక తప్పలేదు. తెలంగాణ హై కోర్టు కరోనా కేసులు తక్కువగా చూపిస్తున్నారని, వీకండ్ లాక్ డౌన్ పెట్టాలని, కర్ఫ్యూ ఆంక్షలు అమలు చేస్తేనే కరోనా కట్టడి సాధ్యమని ఎప్పటికప్పుడు తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంది.
అయితే నేడు కేసీఆర్ కేబినెట్ మీటింగ్ నిర్బహించి తెలంగాణ లాక్ డౌన్ పై నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణాలో ఓ పది రోజుల పాటు లాక్ డౌన్ విధిస్తున్నామని, ఈ పది రోజులపాటు రోజు 20 గంటల లాక్ డౌన్ ఉంటుంది అని, ఉదయం 6 గంటల నుండి 10 ల లోపు నిత్యావసర సరుకుల కోసం మాత్రమే ప్రజలు బయటికి రావాలని, దుకాణాలు, మిగతా అన్ని పది తర్వాత మూసివేయాలని, లాక్ డౌన్ ఉల్లంఘనలు మీరితే కఠిన చర్యలు ఉంటాయని కేసీఆర్ లాక్ డౌన్ పై ప్రకటన చేసారు. రేపటినుండి తెలంగాణాలో ఈ నెల 22 వరకు లాక్ డౌన్ అమలులో ఉంటుంది అని ప్రభుత్వం ప్రకటించింది.