Advertisementt

క్రిష్ సినిమాకి వీఎఫ్ఎక్స్ ప్రోబ్లెంస్

Tue 11th May 2021 11:45 AM
krish and vaishnav tej combo movie,krish,vaishnav tej,kondapolam,vfx problems  క్రిష్ సినిమాకి వీఎఫ్ఎక్స్ ప్రోబ్లెంస్
VFX Problems for Krish - Vaishnav Movie క్రిష్ సినిమాకి వీఎఫ్ఎక్స్ ప్రోబ్లెంస్
Advertisement
Ads by CJ

ప్రస్తుతం క్రిష్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ చాలా తక్కువ శాతం మాత్రమే పూర్తయ్యింది. ఎలాగూ 2022 సంక్రాంతికి రిలీజ్ డేట్ ఇచ్చారు కాబట్టి ప్రస్తుతం షూటింగ్ వాయిదా పడినా కంగారు పడాల్సిన పని లేదు. పవన్ కళ్యాణ్ కి కరోనా రావడం, సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్స్ కి బ్రేకులు పడడంతో.. ఆ సినిమా షూటింగ్ ఆగిపోయింది. అయితే ఇప్పడు క్రిష్ ఆల్రెడీ పూర్తి చేసేసి విడుదలకు సిద్దమైంది అంటున్న వైష్ణవ్ తేజ్ - రకుల్ కాంబోలో తెరకెక్కిన మూవీ కి ఇప్పుడు సీజీ వర్క్ ప్రాబ్లమ్ తలెత్తింది.

అసలు ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఆ మూవీ కి ఓటిటి ఆఫర్స్ వస్తున్నాయని, క్రిష్ ఎప్పుడో ఓటిటీలతో బేరానికి దిగాడని, త్వరలోనే వైష్ణవ్ తేజ్ సెకండ్ మూవీ ఓటిటిలో రిలీజ్ అంటూ ఏవేవో వార్తలొస్తున్నా.. అసలు క్రిష్ - వైష్ణవ తేజ్ మూవీ షూటింగ్ పూర్తయి ఆ సినిమాకి సంబందించిన  వీఎఫెక్స్ వర్క్ పూర్తి కాలేదట. ఫారెస్ట్ నేప‌థ్యంలో సాగే ఈ క‌థ లో జంతువుల్నీ, ఆ వాతావ‌ర‌ణాన్ని సృష్టించ‌డానికి వీఎఫ్ఎక్స్ చాలా కీల‌కం. దానికి సంబందించిన 80 శాతం ప‌ని వీఎఫ్ఎక్స్ కంపెనీల‌దే. అయితే క్రిష్ ఎప్పుడో వీఎఫ్ఎక్స్ కంపెనీ లకి పని అప్పజెప్పినా ఈ డిసెంబర్ వరకు వర్క్ పూర్తి చేసి ఇవ్వలేమని సదరు వీఎఫ్ఎక్స్ కంపెనీలు చేతులెత్తేశాయట.

ఇక ఎలాగూ లాక్ డౌన్.. థియేటర్స్ మూతబడ్డాయి. కాబట్టి వీఎఫ్ఎక్స్ వాళ్ళు లేట్ అవుతున్నా క్రిష్ టెంక్షన్ పడడం లేదట. ఎందుకంటే ఈ మూవీని థియేటర్స్ లోనే రిలీజ్ చెయ్యాలని క్రిష్ ఫిక్స్ అయ్యాడట. ఎట్టిపరిస్థితుల్లో ఓటిటికి అమ్మనని చెప్పేశాడట.

VFX Problems for Krish - Vaishnav Movie:

Krish and Vaishnav Tej film based on Kondapolam

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ