ఆ స్టార్ హీరో తమిళంలో సూపర్ స్టార్. కోలీవుడ్ లో నెంబర్ వన్ ప్లేస్ లో ఉన్న హీరో. పాలిటిక్స్ లోకి వస్తాడంటున్నా క్లారిటీ ఇవ్వడు. విపరీతమైన క్రేజ్, ఫాన్స్ ఉన్న ఆ హీరో ఎవరో కాదు. విజయ్. విజయ్ తో సినిమాల కోసం స్టార్ డైరెక్టర్స్, బడా నిర్మాతలు వెంటపడుతుంటే.. టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు విజయ్ ని తెలుగులో నటింపచేసేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టాడు. టాలీవుడ్ డైరెక్టర్ వంశి పైడిపల్లి డైరెక్షన్ లో దిల్ రాజు విజయ్ తో తెలుగులో సినిమా చెయ్యాలనే కోరికతో రిస్క్ చేస్తున్నట్టే అనిపిస్తుంది. విజయ్ సినిమాలకు తెలుగులో మర్కెట్ ఉంది. కానీ తెలుగులో విజయ్ నటిస్తే.. అది కూడా భారీ బడ్జెట్ మూవీలో నటించడం అంటే వర్కౌట్ అవుతుందా?
అందులోనూ కోలీవుడ్ లో భారీ పారితోషకం అందుకుంటున్న విజయ్ కి తెలుగు డెబ్యూ కోసం 90 కోట్లు రెమ్యూనిరేషన్ ఇచ్చి.. సినిమాకి భారీ బడ్జెట్ పెట్టి చేయించడం అనేది రిస్క్ కాక ఇంకేమవుతుంది. దిల్ రాజు విజయ్ కి భారీగా అంటే 90 కోట్ల పారితోషకం తో లాక్ చేసి వంశి పైడిపల్లితో సినిమా చేయిస్తున్నాడనే టాక్ వినిపిస్తుంది. ఎప్పుడూ పర్ఫెక్ట్ లెక్కలతో ఉండే దిల్ రాజు ఈమధ్యన క్రేజ్ ఉన్న హీరోల కోసం బడ్జెట్ క్రాస్ చెయ్యడం, లెక్కలు లిమిట్ దాటినా పట్టించుకోకపోవడం వంటివి చేస్తున్నాడు. అలాగే విజయ్ తో సినిమా కోసం ఓ 150 కోట్ల బడ్జెట్ పెట్టి సినిమా తీసే యోచనలో ఉన్నాడట. మరి తమిళ హీరోని పట్టుకొచ్చి తెలుగులో సినిమా చేసి.. అది కూడా భారీ బడ్జెట్ తో, ఆ హీరోకే భారీగా చదివించి.. ఇంత రిస్క్ దిల్ రాజు చేస్తాడంటారా.. ఏమో చేసినా చెయ్యొచ్చు అంటున్నారు.