Advertisementt

ఎన్టీఆర్ కి కరోనా: చంద్రబాబు ప్రార్ధన

Mon 10th May 2021 08:31 PM
lokesh,chandra babu,jr ntr,speedy,recovery,coronavirus  ఎన్టీఆర్ కి కరోనా: చంద్రబాబు ప్రార్ధన
Chandrababu wishes jr ntr speedy recovery from coronavirus ఎన్టీఆర్ కి కరోనా: చంద్రబాబు ప్రార్ధన
Advertisement
Ads by CJ

టాలీవుడ్ స్టార్ హీరో తారక్ తనకి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది అంటూ స్వయానా ట్వీట్ చెయ్యడంతో ఆయన ఫాన్స్ ఆందోళనకి గురయ్యారు. ఎన్టీఆర్ తనకి స్వల్ప లక్షణాలు మత్రమే ఉన్నాయని ట్రీట్మెంట్ తీసుకుంటున్నా  అని.. ఇంట్లోనే హోమ్ ఐసోలేషన్ లో ఉన్నాను అని ఫాన్స్ ని ఆందోళన చెందవద్దు అంటూ ట్వీట్ చేసాడు. అయితే కొన్నాళ్లుగా ఎన్టీఆర్ ఫ్యామిలీని దూరం పెడుతున్న చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ త్వరగా కోలుకోవాలి అంటూ ట్వీట్ చెయ్యడం హాట్ టాపిక్ గా మారింది. కొన్నాళ్లుగా చంద్రబాబు నాయుడు ఇంకా నందమూరి ఫ్యామిలీ మొత్తం ఎన్టీఆర్ ని దూరం పెడుతున్నారు. ఎన్టీఆర్ టిడిపి జెండా పడితేనే కానీ టిడిపి పరిస్థితి బాగుపడదు అంటూ టిడిపి నాయకులూ ఈమధ్యన ఎన్టీఆర్ పేరు ఎక్కువ తీస్తున్నా చంద్రబాబు మాత్రం ఉలుకూపలుకూ లేకుండా ఉంటున్నారు.

కానీ ఎన్టీఆర్ కి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యాక చంద్రబాబు తారక్ త్వరగా కోలుకోవాలంటూ ట్వీట్ చెయ్యడమే కాదు, ఈ సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని, పూర్తి ఆరోగ్యంతో ఉండాలని ఆకాంక్షిస్తున్నట్టుగా ట్వీట్ చేసారు. అంతేకాదు. చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ కూడా తారక్ త్వరగా కోలుకోవాలని, ఆయనతో పాటుగా ఆయన ఫ్యామిలీ మెంబెర్స్ కూడా జాగ్రత్తలు తీసుకోవాలని, ఎన్టీఆర్ కరోనా నుండి సత్వరమే కోలువాలని ప్రార్దిస్తున్నట్టుగా లోకేష్ ట్వీట్ చేసారు. అలాగే ఎన్టీఆర్ మేనత్త పురందరేశ్వరి, ఇంకా టిడిపి నాయకులూ ఎన్టీఆర్ త్వరగా కోలుకోవాలంటూ ట్వీట్స్ చేస్తున్నారు.

Chandrababu wishes jr ntr speedy recovery from coronavirus:

Lokesh wishes jr ntr speedy recovery from coronavirus

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ