వకీల్ సాబ్ నిర్మాత దిల్ రాజు వకీల్ సాబ్ సక్సెస్ సెలెబ్రేషన్స్, వకీల్ సాబ్ బాక్సాఫీసు కలెక్షన్స్ తో ఫుల్ హ్యాపీ. ఇక వకీల్ సాబ్ సినిమా విడుదలైన టైం లో కరోనా బారిన పడిన దిల్ రాజు కొద్ది రోజుల రెస్ట్ తో మళ్ళి బయట ప్రపంచంలోకి అడుగుపెట్టేసాడు. అయితే వకీల్ సాబ్ సక్సెస్ తో హ్యాపీ గా ఆయన తన వైఫ్ ని తీసుకుని అమెరికా చెక్కేసాడు. తన మొదటి భార్య చనిపోవడంతో సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాడు దిల్ రాజు. అది కూడా ఇదే టైం అంటే కరోనా లాక్ డౌన్ టైం లోనే మే 10 న ఆయనకి ఎంతో ఇష్తమైన వెంటకటేశ్వర స్వామి గుడిలో కొద్దిపాటి బంధుమిత్రుల మధ్యన పెళ్లి చేసుకున్నాడు దిల్ రాజు.
ఇక ప్రస్తుతం భార్య తో కలిసి దిల్ రాజు యూఎస్ కి చెక్కేసిన విషయం మీడియా ప్రముఖంగా ప్రచురించింది. కరోనా సెకండ్ వేవ్ సిట్యువేషన్ లో దిల్ రాజు తన భార్యని తీసుకుని అమెరికా ఎందుకు వెళ్ళాడో తెలుసా.. తన మొదటి పెళ్లి రోజు వేడుకలని జారుకునేందుకే అని తెలుస్తుంది. పెళ్లి రోజు వేడుకల కోసం ప్రత్యేకించి దిల్ రాజు వైఫ్ తో సహా యుఎస్ ఫ్లైట్ ఎక్కినట్లుగా టాక్. అక్కడే ఆయన ఈ రోజు అంటే మే 10న ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీని జరుపుకోబోతున్నారట.