Advertisementt

బంగార్రాజు స్టోరీపై ఇంట్రెస్టింగ్ న్యూస్

Mon 10th May 2021 11:35 AM
nagarjuna - kalyan krishna,bangarraju movie,nag - chaitu - akhil,nagarjuna,naga chaitanya,akhil,bangarraju movie update  బంగార్రాజు స్టోరీపై ఇంట్రెస్టింగ్ న్యూస్
Bangarraju movie latest update బంగార్రాజు స్టోరీపై ఇంట్రెస్టింగ్ న్యూస్
Advertisement
Ads by CJ

నాగార్జున కి ఈమధ్యన ఏది కలిసి రావడం లేదు.. వరస డిజాస్టర్స్ తో మార్కెట్ పరంగా డల్ అయిన నాగార్జునకి కి వైల్డ్ డాగ్ అయినా ఒడ్డున పడేస్తుంది అనుకుంటే.. వైల్డ్ డాగ్ మూవీ ని థియేటర్స్ లో ప్రేక్షకులు అంతగా వీక్షించింది లేదు. దానితో వసూళ్ల పరంగా సో సో హిట్ గా నిలిచిన వైల్డ్ డాగ్ ని నెట్ ఫ్లిక్స్ ప్రేక్షకులు నెత్తిన పెట్టుకున్నారు. థియేటర్స్ లో ప్లాప్ గా నిలిచిన ఈ సినిమా ఓటిటిలో సూపర్ హిట్ అయ్యింది. ప్రవీణ్ సత్తారుతో నాగార్జున తన నెక్స్ట్ మూవీ చేస్తున్నా కరోనా కారణముగా ఆ మూవీ షూటింగ్ ఆగిపోయింది. ఎప్పటినుండో నాగార్జున కలల ప్రాజెక్ట్ బంగార్రాజుని జులై నుండి పట్టాలెక్కించబోతున్నట్టుగా నాగ్ ఈమధ్యన ఓ ఇంటర్వ్యూలో చెప్పిన విషయం తెలిసిందే.

కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో సోగ్గాడే చిన్ననాయనతో హిట్ కొట్టడంతో అదే కళ్యాణ్ కృష్ణ తోనే నాగ్ బంగార్రాజు ప్రాజెక్ట్ చెయ్యాలని డిసైడ్ అయ్యి ఏళ్ళు గడుస్తున్నా ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కింది లేదు. రీసెంట్ ఆ ప్రాజెక్ట్ పై నాగార్జున.. అక్కినేని ఫాన్స్ కి ఆశలు కల్పించాడు. అయితే ఇప్పుడు బంగార్రాజు స్టోరీ ఇదే అంటూ ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సోగ్గాడే చిన్నినాయనలో తండ్రి కొడుకుగా నాగ్ డ్యూయెల్ రోల్ చేస్తే.. బంగార్రాజు లో నాగార్జున కొడుకుగా చైతూ, చైతూ కొడుకుగా అఖిల్ కనిపిస్తారట. అయితే చైతు రోల్ చాలా తక్కువ అంటే జస్ట్ గెస్ట్ రోల్ లా ఉండబోతుందన్నమాట. ఇక తాత నాగ్ మనవడు అఖిల్ మధ్యనే కథ మొత్తం నడుస్తుంది.. అని బంగార్రాజు లో అదే ట్విస్ట్ అంటూ ప్రచారం మొదలయ్యింది.

Bangarraju movie latest update:

Nagarjuna - Kalyan Krishna Bangarraju Movie update

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ