Advertisementt

ప్రముఖ జర్నలిస్ట్ TNR మృతి

Mon 10th May 2021 10:48 AM
popular journalist,tnr,tnr died,covid-19  ప్రముఖ జర్నలిస్ట్ TNR మృతి
Popular Journalist TNR Died ప్రముఖ జర్నలిస్ట్ TNR మృతి
Advertisement
Ads by CJ

కరోనా కాటుకి జర్నలిస్ట్ లేదు, సెలెబ్రిటీ లేదు.. రోజుకి వేలల్లో బలి తీసుకుంటుంది కరోనా మహమ్మారి. ప్రముఖ జర్నలిస్ట్ TNR కరోనా తో పోరాడుతూ మరణించడం అందరిని కలిచివేసింది. టీఎన్నార్ టాక్ షో అంటూ ఆయన చేసిన సెలెబ్రిటీ ఇంటర్వూస్ పాపులర్ అవడంతో TNR కి మంచి పేరొచ్చింది. TNR టాక్ షో అంటే సెలబ్రిటీస్ పర్సనల్ విషయాలు, వారి కెరీర్ కి సంబందించిన విషయాలను తెలుసుకోవచ్చనే కుతూహలంతో చాలామంది ఆ ఇంటర్వూస్ ని వీక్షించేవారు. దానితో ఆయనకి బాగా పేరొచ్చింది. కేవలం సెలెబ్రిటీ ఇంటర్వూస్ మాత్రమే కాదు.. ఆయన కొన్ని సినిమాల్లో నటించారు కూడా.

కొన్ని రాజులుగా కరోనా తో పోరాడుతున్న ఆయన హోమ్ ఐసోలేషన్ లో డాక్టర్స్ ప్రికాషన్స్ మేరకు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. కానీ పరిస్థితి చేజారడంతో TNR ని ఓ ప్రవేట్ హాస్పిటల్ లో జాయిన్ చెయ్యగా.. నిన్న TNR ఆరోగ్యం పరిస్థితి మరింత విషమించడంతో వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు. ఆయన కి ట్రీట్మెంట్ ఇస్తున్నా.. ట్రీట్మెంట్ కి శరీరం స్పందించకపోవడంతో ఈ రోజు ఉదయం ఆయన కన్ను మూసారు. TNR మరణ వార్త విని అందరూ షాక్ కి గురయ్యారు. ప్రముఖులు, తోటి జర్నలిస్ట్ లు ఆయన మృతికి సంతాపం తెలియజేస్తున్నారు.

Popular Journalist TNR Died:

Popular Journalist TNR Died Of Covid-19

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ