టాలీవుడ్ లో దాదాపుగా ఒకేసారి స్టార్ డం సంపాదించుకుని ప్రస్తుతం ఆ ఇద్దరు ఫ్రెండ్స్ పాన్ ఇండియా మూవీస్ తో బిజీగా వున్నారు. వారెవరో కాదు. విజయ్ దేవరకొండ - రష్మిక. గీత గోవిందం అప్పటినుండి మంచి ఫ్రెండ్స్ గా మారిన ఈ ఇద్దరు డియర్ కామ్రేడ్ లో కలిసి నటించడంతో వారి మధ్యన సం థింగ్ సం థింగ్ అనే న్యూస్ నడిచినా.. వారు అదేం లేదు. కేవలం ఫ్రెండ్స్ మాత్రమే అన్నారు. తర్వాత విజయ్ దేవరకొండ ఫ్యామిలీతో రష్మిక ఫ్రెండ్షిప్, ముంబై లో విజయ్ దేవరకొండ తో డిన్నర్ డేట్ అబ్బో ఇవన్నీ చూసాక చాలామంది వీరు లవర్స్ అనే అంటున్నారు. ఇక తాజాగా రష్మిక - విజయ్ కలిసి ఓ యాడ్ కూడా చేసారు.
ప్రస్తుతం విజయ్ దేవరకొండ లైగర్ పాన్ ఇండియా మూవీ తోనూ, రష్మిక పుష్ప పాన్ ఇండియా మూవీతో బిజీగా వున్నారు. ఇక విజయ్ దేవరకొండ పుట్టిన రోజునాడు ఆయనకి సెలబ్రిటీస్, ఫాన్స్ అంతా ట్విట్టర్ వేదికగా, మిగతా సోషల్ మీడియా వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. కానీ విజయ్ దేవరకొండ బెష్టి అయిన రష్మిక లేట్ గా ఫ్రెండ్ కి బర్త్ డే విషెస్ చెబుతూ.. సారి లేట్ అయ్యింది.. హాప్పీయస్ట్ బర్త్ డే సూపర్ స్టార్ విజయ్ దేవరకొండ.. ఓన్లీ అండ్ ఓన్లీ హప్పినెస్స్ టు యు. Sorry ‘m late.. happiest birthday Superstar @TheDeverakonda Only and only happiness to you.. అంటూ ఓ పిక్ పోస్ట్ చేసింది.
ఇక విజయ్ తో పాటుగా ఈ రోజు బర్త్ డే జరుపుకుంటున్న మరో హీరోయిన్ సాయి పల్లవికి కూడా రష్మిక పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది. ప్రస్తుతం రష్మిక పోస్ట్ చేసిన విజయ్ - రష్మిక పిక్ తో పాటుగా రష్మిక విషెస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.