Advertisementt

బన్నీని సర్ప్రైజ్ చేసిన చరణ్

Sun 09th May 2021 07:02 PM
allu arjun,corona virus,covid 19,ram charan,charan surprise,bunny  బన్నీని సర్ప్రైజ్ చేసిన చరణ్
Charan Showers Surprise On Bunny బన్నీని సర్ప్రైజ్ చేసిన చరణ్
Advertisement
Ads by CJ

రామ్ చరణ్ - అల్లు అర్జున్ మెగా హీరోలు, బావ బావమరుదులు కూడా. తరుచూ ఫ్యామిలీ ఫంక్షన్స్ లోనూ, మిడ్ నైట్ పార్టీల లోనూ కలుస్తుంటారు. అయితే చరణ్ కి బన్నీ కి కలవడానికి ఈ మధ్యన భారీ గ్యాప్ వచ్చేసింది. కారణం వారు నటిస్తున్న సినిమా షూటింగ్స్ కాదు. కరోనా. రీసెంట్ గా అల్లు అర్జున్ కి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అవడంతో హోమ్ క్వారంటైన్ లో ఉన్నట్లుగా అల్లు అర్జున్ అభిమానులకి షేర్ చేసిన విషయం తెలిసిందే. అలాగే కొన్ని రోజుల క్రితం, తన హెల్త్ అప్ డేట్ కూడా ఇచ్చాడు.

అయితే కరోనా కారణంగా ఫ్యామిలీకి దూరంగా ఉండాల్సి వస్తున్నందుకు అల్లు అర్జున్ ఆ మధ్యన ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. తాజాగా రామ్ చరణ్ అల్లు అర్జున్ త్వరగా కోలుకోవాలని అంటూ ఓ లెటర్ ని బన్నీకి పంపడమే కాదు.. త్వరగా కోలుకో.. తర్వాత ఓసారి కలుద్దాం అంటూ చరణ్ లెటర్ పంపడంతో అల్లు అర్జున్ ఆ విషయాన్నీ ఇన్స్టా ద్వారా షేర్ చేస్తూ థాంక్స్ చెప్పాడు. రామ్ చరణ్ పంపిన లేటర్ ని బన్నీ తన ఇన్స్టా స్టోరీలో పెట్టాడు. నీ ఆరోగ్యం త్వరగా కుదుటపడాలని కోరుకుంటున్నా.. అలాగే నీవు బావున్నాక ఓసారి కలుద్దాం ప్రేమతో చరణ్ అంటూ చరణ్ బన్నీకి లెటర్ ద్వారా మెస్సేజ్ పంపించాడు. ప్రస్తుతం చరణ్ బన్నీకి రాసిన లెటర్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

Charan Showers Surprise On Bunny:

Ram Charan sends goodies to Allu Arjun

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ