Advertisementt

ఉన్నట్టుండి ట్రేండింగ్ లో పవన్ సినిమా

Sun 09th May 2021 06:06 PM
hari hara veera mallu movie,krish,pawan kalyan,hari hara veera mallu first glimpse,hits 320k likes,twitter,5.8m views  ఉన్నట్టుండి ట్రేండింగ్ లో పవన్ సినిమా
Hari Hara Veera Mallu trends in Twitter ఉన్నట్టుండి ట్రేండింగ్ లో పవన్ సినిమా
Advertisement
Ads by CJ

హీరోల ఫాన్స్ తల్చుకుంటే ఏమైనా చేస్తారు. ఎక్కడో మూలాన పడిన సినిమాలను ట్రేండింగ్ లో ఉంచగలరు. అలాగే తమ హీరోలకి ఏదైనా అయితే #Getwellsoon హాష్ టాగ్స్ ని ట్రెండ్ చెయ్యను గలరు. అప్పుడప్పుడు అల్లు అర్జున్ ఫాన్స్ ఇలానే చేస్తుంటారు. అర్ధం పర్ధం లేకుండా అల్లు అర్జున్ పాత సినిమాలని, అల్లు అర్జున్ పేరుని, అలాగే అల్లు అర్జున్ లేటెస్ట్ పాన్ ఇండియా ఫిలిం పుష్ప ని అప్పుడప్పుడు హాష్ టాగ్స్ పెట్టి ట్రెండ్ చేస్తుంటారు. అయితే ప్రస్తుతం లాక్ డౌన్ వలన, పవన్ కి కరోనా సోకడంతో సినిమా షూటింగ్ ఆపుకుని.. రెస్ట్ తీసుకుంటున్న పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీని ఫాన్స్ ట్రేండింగ్ లో ఉంచారు.

అది కూడా క్రిష్ - పవన్ కాంబోలో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు మూవీ ని పవన్ కళ్యాణ్ ఫాన్స్ ట్రెండ్ చేస్తున్నారు. PSPK27, #HariHaraVeeraMallu హాష్ టాగ్స్ తో పవన్ ఫాన్స్ రెచ్చిపోయి ట్వీట్స్ పెడుతున్నారు. దానితో #HariHaraVeeraMallu హాష్ టాగ్ ట్విట్టర్ లో ట్రెండ్ అవుతుంది. Can I get 20 mentions of @PawanKalyan ???, @PawanKalyan Is Something Different Than Others , Just Like Lion Lion face Attitude , Swag And Mannerism Makes Him Unique Red heart, అంటూ ట్వీట్స్ పెడుతూ పవన్ ఫాన్స్.. క్రిష్ - పవన్ కాంబో మూవీని ట్రెండింగ్ లో ఉంచారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కరోనా నుండి కోలుకున్నా కూడా హరిహర వీరమల్లు మూవీ, ఏకే రీమేక్ షూటింగ్స్ ని ఆపేసారు. సెకండ్ వెవ్ ఉధృతిలో షూటింగ్ వద్దని పవన్ కూడా చెప్పడంతో క్రిష్ అండ్ శేఖర్ కే చంద్ర కామ్ అయ్యారు.

Hari Hara Veera Mallu trends in Twitter:

HariHaraVeeraMallu first glimpse hits 320K likes and 5.8M views 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ