అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ప్రస్తుతం బాలీవుడ్ మూవీస్ తో హీరోయిన్ గా పేరు తెచ్చుకోవడానికి కష్టపడుతుంది. శ్రీదేవి బ్రతికుండగానే జాన్వీ కపూర్ సిల్వర్ స్క్రీన్ కి పరిచయం కావల్సి ఉన్నా.. ఆమె మరణం తర్వాతే జాన్వీ నటించిన తొలి సినిమా విడుదలైంది. అయితే శ్రీదేవి తన కూతురు జాన్వీ కపూర్ ని హీరోయిన్ గా చూడకముందే కన్ను ముయ్యడం చాలామందికి బాధని కలిగించింది. కానీ శ్రీదేవి తన కూతురు జాన్వీ హీరోయిన్ అవ్వాలనుకోలేదట. జాన్వీ కపూర్ ని ఓ పెద్ద డాక్టర్ గా చూడాలనే కోరిక ఆమెకి ఉండేదట.
కాలేజ్ చదివే రోజుల్లో తన తల్లి ఇదే మాట చాలాసార్లు చెప్పేదంటూ జాన్వీ కపూర్ మాతృ దినోత్సం రోజున భావోద్వేగానికి లోనైంది.
కానీ తాను ఎక్కువగా సినీ ఫీల్డ్ లో పెరగడం వలన, సినిమా వాతావరణం అలవాటైపోయి.. చిన్నప్పటినుడినే నటనపై ఆసక్తి పెరిగింది అని, తనకున్న టాలెంట్ కి, తనకున్న చదువుకి డాక్టర్ గా పనికి రానని తేలిపోయింది అని, చివరికి తన తల్లి శ్రీదేవి కూడా తాను సినిమాల్లో నటించడానికి ఒప్పుకుంది అని, కానీ అమ్మ కోరిక ప్రకారం డాక్టర్ కాలేకపోయి, అమ్మ కలను నెరవేర్చలేకపోయాను అంటూ ఎమోషనల్ అయ్యింది జాన్వీ కపూర్.