గురువారం, శుక్రవారం ఈటీవీలో ప్రసారం అవుతున్న జబర్దస్త్ షో కి అనేకమంది ఫాన్స్ ఉన్నారు. ఎన్ని షోస్ వచ్చినా జబర్దస్త్ క్రేజ్ మాత్రం తగ్గదు. ఎనిమిదేళ్ళనుండి నిరాటంకంగా జబర్దస్త్ షో ని మల్లెమాల వారు రన్ చేస్తున్నారు. మధ్యలో కొంతమంది కమెడియన్స్ వెళ్లిపోతున్నారు.. కొత్తవారు వస్తున్నారు. జేడ్జ్ ప్లేస్ ఎలా ఉన్నా, వ్యక్తులు మారుతున్నా జబర్దస్త్ షో క్రేజ్ తగ్గలేదు. ఇక కొన్నాళ్లుగా జబర్దస్త్ పర్మినెంట్ జేడ్జ్ రోజా అనారోగ్య కారణాలతో జబర్దస్త్ షో కి తాత్కాలికమైన విరామం ఇచ్చింది. ఈ షో నుండి జేడ్జ్ ప్లేస్ లో ఉన్న నాగబాబు వెళ్ళిపోయినా.. రాజకీయాలతో బిజీగా వున్నా రోజా మాత్రం జబర్దస్త్ షో వదల్లేదు. కానీ ఆమె ఆరోగ్యం రీత్యా కొన్ని రోజుల పాటు రెస్ట్ అవసరమవడంతో రోజా జబర్దస్త్ షోకి తాత్కాలిక విరామం ఇచ్చింది.
కొన్నాళ్లుగా ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటున్న రోజా మళ్ళీ జబర్దస్త్ కి ఎంట్రీ ఇవ్వబోతుంది. ఇప్పటివరకు రోజా ప్లేస్ లోకి ఇంద్రజ స్పెషల్ గెస్ట్ గా వస్తుంది. మనో తో కలిసి ఇంద్రజ జబర్దస్త్ కి జేడ్జ్ గా వస్తుంది. రోజా లాగే ఇంద్రజ కూడా స్టేజ్ మీద డాన్స్ తో ఆకట్టుకుంటున్నా రోజా లేని లోటు మాత్రం కనిపిస్తుంది. స్కిట్స్ మధ్యలో రోజా వేసే పంచ్ లని కమెడియన్స్ తో పాటుగా ప్రేక్షకులు మిస్ అవుతున్నారు. ఇక రోజా కొన్ని రోజులుగా రెస్ట్ లో ఉండడంతో ఆమె కోలుకుని మళ్ళీ జబర్దస్త్ కి జేడ్జ్ గా వచ్చేస్తుందట. అటు రాజకీయాలు, ఇటు జబర్దస్త్ జేడ్జ్ గా అబ్బో రోజా మరోసారి బిజీ కాబోతుందన్నమాట.