Advertisementt

బిగ్ బాస్ 5 డేట్ ఫిక్స్ అయ్యింది

Sat 08th May 2021 10:26 PM
telugu bigg boss-5,bigg boss-5 season,bigg boss  బిగ్ బాస్ 5 డేట్ ఫిక్స్ అయ్యింది
Bigg Boss-5 Season Date Fix? బిగ్ బాస్ 5 డేట్ ఫిక్స్ అయ్యింది
Advertisement
Ads by CJ

నార్త్ అంత పాపులర్ కాకపోయినా.. సౌత్ లోనూ బిగ్ బాస్ బాగానే పాపులర్ అయ్యింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం లో బిగ్ బాస్ మొదలైనప్పటినుండి ఇప్పటివరకు బ్రేక్ లేకుండా చేస్తున్నారు. గత ఏడాది కరోనా వచ్చినా అన్ని జాగ్రత్తలతో తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 ని పూర్తి చేసింది స్టార్ మా. గత ఏడాది బిగ్ బాస్ విన్నర్ గా అభిజిత్ బయటికి వస్తే అఖిల్ రన్నర్ గా బయటికి వచ్చాడు. కానీ థర్డ్ ప్లేస్ లో ఉన్న సోహెల్ మాత్రం ప్రస్తుతం బిగ్ బాస్ క్రేజ్ తో కెరీర్ లో దూసుకుపోతున్నాడు. రోజూ గంటసేపు బుల్లితెర ప్రేక్షకులని ఎంటర్టైన్ చేసే స్టార్ మా ఈ ఏడాది బిగ్ బాస్ కోసం ప్రిపేర్ అవుతుంది.

కరోనా పాండమిక్ సిట్యువేషన్ లోనూ స్టార్ మా బిగ్ బాస్ సీజన్ 5 కోసం ఏర్పాట్లని మొదలు పెట్టేసిందట. కాకపోతే జులై నుండి కాకుండా ఆగష్టు నుండి బిగ్ బాస్ సీజన్ 5 ని మొదలు పెట్టబోతుందట. నాగార్జున హోస్ట్ గా బిగ్ బాస్ సీజన్ 5 ఆగష్టు ఫస్ట్ వీక్ నుండి మొదలు కాబోతుంది. సీజన్ 5 లో పెద్దగా ఫేమ్ లేని సెలబ్రిటీస్ పాల్గొంటారని అంటున్నా.. ఈసారి టిక్ టాక్ స్టార్స్ తో పాటుగా యూట్యూబ్ స్టార్స్ కూడా పాల్గొనబోతున్నారట. అందులో టివి ఆర్టిస్ట్ లు కూడా ఉంటారట. ఇక ఎప్పటిలాగే ఓ న్యూస్ యాంకర్ ని కూడా తీసుకోబోతున్నారని తెలుస్తుంది. బిగ్ బాస్ సీజన్ 5 కూడా 4 మాదిరిగానే కరోనా జాగ్రత్తలతో మొదలు కాబోతున్నట్టుగా టాక్.

Bigg Boss-5 Season Date Fix?:

Telugu Bigg Boss-5 Season Date Fix?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ