ఉప్పెన తో మెగా హీరో వైష్ణవ్ తేజ్ గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చినట్టే. ఎందుకంటే ఉప్పెన సినిమాని గనక నిర్మాతలు ఓటిటికి అమ్మేసినట్టైతే ఆ సినిమాకి అన్ని కలెక్షన్స్ వచ్చేవి కాదు, వైష్ణవ తేజ్ కి అంత పేరొచ్చేది కాదు. ఉప్పెన సినిమాని కేవలం థియేటర్స్ లోనే రిలీజ్ చేస్తామని మైత్రి మూవీ మేకర్స్ పట్టుబట్టడం చాలా మంచిదైంది. ఆసినిమా మ్యూజికల్, యూత్ఫుల్ హిట్ అయ్యి కలెక్షన్స్ వర్షం కురిపించింది. హీరోగా వైష్ణవ తేజ్ కెరీర్ పరుగులు పెట్టించబోతుంది. ఇప్పటికే రెండు సినిమాలకు కమిట్ అయిన వైష్ణవ్ తేజ్ ఉప్పెన విడుదలకు ముందే దర్శకుడు క్రిష్ తో ఓ మూవీ ని ఫినిష్ చేసేసాడు.
అయితే థియేటర్స్ ఓపెన్ అయ్యాక క్రిష్ - వైష్ణవ తేజ్ మూవీ విడుదల అవుతుంది అనుకుంటే క్రిష్ వైష్ణవ్ తేజ్ సినిమా పక్కనపడేసి పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా మీద దృష్టి పెట్టడం, మళ్ళీ కరోనా సెకండ్ వేవ్ తో థియేటర్స్ మూత బడడం ఇప్పడు క్రిష్ - వైష్ణవ్ తేజ్ మూవీ ముచ్చట మరోసారి హైలెట్ అయ్యింది. ఇప్పడు ఈ సినిమాకి ఓటిటి తప్ప వేరే దిక్కు లేదు. థియేటర్స్ ఓపెన్ అయ్యేవరకు చూడడం వేస్ట్ అంటున్నారు. ఎలాగూ లో బడ్జెట్ మూవీ నే కదా ఓటిటికి అమ్మేస్తారనే న్యూస్ మొదలైంది.
ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసిన క్రిష్ పోస్ట్ ప్రొడక్షన్ కూడా కంప్లీట్ చేసేసాడు. కానీ ఈ సినిమా రిలీజ్ కి ఎందుకో క్రిష్ తెగ ఆలోచించేస్తున్నాడు. ఉప్పెన రిలీజ్ అయ్యాక ఓ నెలకి ఆ క్రేజ్ తో ఈ సినిమాని విడుదల చేస్తారనుకుంటే చేయలేదు. అయితే క్రిష్ వైష్ణవ్ - రకుల్ తో చేసిన సినిమాని ఓటిటికి ఇవ్వాలనే ప్లాన్ చేసి ఓటిటితో బేరం మొదలు పెట్టినా ఎందుకో కుదరలేదని తెలుస్తుంది. మరి ఇప్పుడు కూడా ఓటిటిలో ఈ కొండపాలెం నవల ఆధారంగా తెరకెక్కిన మూవీ విడుదలవ్వొచ్చనే ఊహాగానాలు మొదలయ్యాయి.