కరోనా సెకండ్ వేవ్ తో సినిమాలు వాయిదా పడడమే కాదు.. సినిమా షూటింగ్స్ కూడా వాయిదా పడుతున్నాయి. తెలంగాణాలో అయితే లాక్ డౌన్ పెట్టకపోయినా పలు షూటింగ్స్ లో కరోనా రావడంతో షూటింగ్స్ వాయిదా వెయ్యక తప్పడం లేదు. ఇక తమిళనాడులో ఇప్పటికే చాలా షూటింగ్స్ వాయిదా దిశగా నడుస్తున్నాయి. తాజాగా తమిళనాడు ప్రభుత్వం కూడా లాక్ డౌన్ పెట్టెయ్యడంతో.. ఇప్పుడు అక్కడ షూటింగ్స్ ఆపెయ్యకతప్పలేదు. కానీ పరిమితులతో, తక్కువ సంఖ్యలో షూటింగ్స్ చేస్తున్నా.. వీలుకుదరని సినిమా షూటింగ్స్ వాయిదా పడుతున్నాయి.
తాజాగా కార్తీ సర్ధార్ షూటింగ్ కూడా వాయిదా పడినట్లుగా తెలుస్తుంది. ఈమధ్యనే భారీగా మొదలు పెట్టిన కార్తీ సర్ధార్ లుక్ అందరిని ఆకట్టుకుంది. కొత్తగా కార్తీ సర్ధార్ లుక్ లో అదరగొట్టేసాడు. కార్తీ మేకోవర్ చూసి షాకయ్యారు. అయితే ఇప్పుడు సర్ధార్ కోసం భారీ స్థాయిలో చెన్నై లో ఓ జైలు సెట్ ని నిర్మించారట. ఆ జైలు సెట్ కోసం చాలా భారీగా ఖర్చు పెట్టినట్లుగా తెలుస్తుంది. సినిమాలో చాలా భాగంగా ఆ జైలు సెట్ లో ఉండబోతుంది. ఆ సెట్ లో చాలామంది జూనియర్ ఆర్టిస్ట్ లు పాల్గొనాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు కరోనా, సెకండ్ వేవ్, లాక్ డౌన్ తో అంతమంది జూనియర్ ఆర్టిస్ట్ లు, మూవీ టీం కలిసి షూటింగ్ చెయ్యలేని కారణంగా, మళ్ళీ పరిస్థితులు చక్కబడే వరకు సర్ధార్ షూటింగ్ ని వాయిదా వేస్తున్నట్లుగా తెలుస్తుంది.