కరోనాకి భయపడకండి, ధైర్యంగా ఎదుర్కోండి అంటూ చాలమంది తారలు చెబుతున్నట్టుగానే లైగర్ హీరో విజయ్ దేవరకొండ కూడా ఓ వీడియో షేర్ చేసాడు. చాలామంది తారలు కరోనా పేషేంట్స్ కి ఆక్సిజెన్, మాస్క్ లు, భారీగా విరాళాలు ప్రకటించడం, ఇతరత్రా కరోనా కి సంబందించిన హెల్ప్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక రీసెంట్ గా విజయ్ దేవరకొండ కూడా కరోనా లక్షణాల్లో ఏది కనిపించినా అందరితో సామజిక దూరం పాటించండి. వెంటనే డాక్టర్స్ ని సంప్రదించి.. ప్రికాషన్స్ తీసుకోండి అంటూ ఓ స్పెషన్ వీడియో చేసి షేర్ చేసాడు.
తెలంగాణ గవర్నమెంట్ కరోనా కట్ఠడి చర్యలు తీసుకుంటుంది.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఆరోగ్య కేంద్రంలో, ఏరియా హస్పిటల్స్ లోకోవిడ్ ఔట్ పేషెంట్ డాక్టర్లను పెట్టిందని, కరోనా అనుమానం రాగానే వారు ప్రభుత్వ డాక్టర్స్ తో మాట్లాడవచ్చని, టెస్ట్ చేయించుకుని రిపోర్ట్ కోసం చూడకుండా ట్రీట్మెంట్ మొదలు పెట్టాలని, ప్రస్తుతం ఈ టైం చాలా విలువైంది అని, ఎలాంటి లక్షణులున్నా వెంటనే ట్రీట్మెంట్ మొదలు పెట్టండి, భయపడవద్దు, ధైర్యాన్ని కోల్పోకండి, ప్రభుత్వం ఉచిత మెడికల్ కిట్ ఇస్తుంది అని, అందులో కరోనా మందులు ఉంటాయని ఏ ప్రభుత్వ కోవిడ్ సెంటర్ కి వెళ్లినా అవి దొరుకుతాయని.. కరొనకి భయపడకండి జాగ్రత్తగా ఉండండి అంటూ విజయ్ దేవరకొండ కరోనా జాగ్రత్తలను ఆ వీడియో లో ఉంచాడు.