తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ పెట్టబోమని సీఎం కేసీఆర్ స్పష్టత ఇచ్చిన విషయం తెలిసిందే. లాక్ డౌన్ పెడితే మాత్రం కరోనా కేసులు పెరగడం లేదా? పెట్టిన రాష్ట్రాల్లో కరోనా కేసులు రావడం లేదా? అని ఎదురు ప్రశ్న వేసిన కేసీఆర్ తెలంగాణాలో లాక్ డౌన్ వలన ప్రజలు నష్టపోతున్న కారణంగా లాక్ డౌన్ పెట్టమని క్లారిటీ ఇచ్చారు. అయితే నైట్ కర్ఫ్యూ మరో వారం రోజులపాటు పొడిగించారు. మే 15 వరకు నైట్ కర్ఫ్యూ పొడిగించిన కేసీఆర్ సర్కార్ ఈ నైట్ కర్ఫ్యూ మాత్రమే కాకుండా మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది.
అందులో భాగంగా రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ అమలు చెయ్యడం, పెళ్ళి వేడుకలకు 100 మందికి మించి హాజరుకారాదని, అంతేకాకుండా అంత్యక్రియల్లో 20 మందికి మించి పాల్గొనరాదని పేర్కొన్న తెలంగాణ ప్రభుత్వం.. సామాజిక, రాజకీయ, క్రీడా, వినోద, విద్య, సాంస్కృతిక, మత కార్యక్రమాలపై నిషేధం విధించింది. అలాగే మాస్క్ తప్పనిసరి.. అంటూ సర్కార్ కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది.