మహారాష్ట్రలో మహా జనతా కర్ఫ్యూ నడుస్తుంది. అందుకే అక్కడ సినిమా షూటింగ్స్ దగ్గరనుండి అన్ని బంద్ అయ్యాయి. కానీ ఆదిపురుష్ షూటింగ్ ఆగలేదని డైరెక్టర్ ఓం రౌత్ స్వయానా చెప్పాడు. ఆదిపురుష్ కోసం వేసిన భారీ సెట్ లో చాలా సేఫ్ జోన్ లోనే ఆదిపురుష్ షూటింగ్ చేస్తున్నట్టుగా తెలిసింది. అయితే మహారాష్ట్రలో కోవిడ్ ఎక్కువవుతున్న కారణంగా షూటింగ్ కి ఎక్కడ బ్రేకులు వెయ్యాల్సి వస్తుందో అని.. ఆదిపురుష్ టీం ఓ ప్లాన్ అలోచించి దానికి అనుగుణంగా ఆదిపురుష్ షూటింగ్ కోసం హైదరాబాద్ కి షిఫ్ట్ అవ్వబోతున్నారట. ఇక్కడ ఎలాంటి లాక్ డౌన్, ఎలాంటి కర్ఫ్యూ లేకపోవడంతో.. హైదరాబాద్ లోనే ఆదిపురుష్ కోసం సెట్ వేసి షూటింగ్ చెయ్యాలని ప్లాన్ చేసుకున్నారట.
అందుకు ఓం రౌత్ తన టీం ని తీసుకుని హైదరాబాద్ కి షిఫ్ట్ అవుతున్నాడట. ఇప్పటికే ప్రభాస్ ఇంకొందరు నటులు హైదరాబాద్ కి వచ్చేసినట్లుగా తెలుస్తుంది. ఇక హీరోయిన్ కృతి సనన్, విలన్ పాత్రధారి సైఫ్ అలీఖాన్, లక్ష్మణ్ పాత్రధారి, టెక్నీకల్ టీం మొత్తం హైదరాబాద్ కి వచ్చేసి.. ఇక్కడే ఆ సినిమా షూటింగ్ చేయబోతున్నారట. ఆదిపురుష్ మూవీ యూనిట్ మొత్తం మూడు నెలల పాటు హైదరాబాద్ లోనే ఉండబోతుంది. అంటే ఇక్కడ మేజర్ షూటింగ్ కంప్లీట్ అవడం ఖాయంగా కనిపిస్తుంది. మరి ఈ విషయం తెలిసాక ప్రభాస్ ఫాన్స్ చాలా హ్యాపీగా ఫీలవుతున్నారు. కోవిడ్ అని ఇంట్లోనే కూర్చోకుండా ఆదిపురుష్ కోసం కష్టపడుతున్న టీం ని ప్రభాస్ ని తెగ మెచ్చేసుకుంటున్నారట.