A1 ఎక్స్ప్రెస్ తో మంచి హిట్ అందుకున్న సందీప్ కిషన్ తను నటించే ప్రతి సినిమాలోనూ ఓ కొత్తదనాన్ని చూపిస్తూ ఎప్పటికప్పుడు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తుంటారు యంగ్ వర్సెటైల్ హీరో సందీప్ కిషన్. తన తదుపరి చిత్రాల జానర్స్ ఎంపికలోనూ వైవిధ్యత ప్రదర్శించడం సందీప్ కిషన్ ప్రత్యేకత. ఈ అంశాలను ఫాలో అవుతూనే సందీప్ కిషన్ మరో ఆసక్తికర సినిమాను ఓకే చేశారు. కథ, కథనాల ప్రకారం ఈ సినిమా సందీప్ కెరీర్‌లో ఓ ప్రయోగాత్మక మూవీగా నిలవనుంది. అంతే కాకుండా సందీప్ కిషన్ కెరీర్‌లో ఇది 28వ చిత్రం కావడం విశేషం.
సందీప్‌కిషన్‌కు టైగర్ వంటి మంచి ప్రేక్షకాదరణ లభించిన సినిమాను అందించిన విభిన్న దర్శకుడు వీఐ ఆనంద్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. కాన్సెప్ట్ వైజ్‌గా దర్శకుడు వీఐ ఆనంద్‌కు, పెర్ఫార్మెన్స్ పరంగా సందీప్ కిషన్‌కు టైగర్ ఒక కొత్త తరహా చిత్రం. ముఖ్యంగా సందీప్ కిషన్ పవర్‌ప్యాక్డ్ యాక్షన్ ఆడియన్స్‌ను ఎట్రాక్ట్ చేసిందని చెప్పవచ్చు.
దాదాపు ఆరు సంవత్సరాల తర్వాత హీరో సందీప్‌కిషన్, దర్శకుడు వీఐ ఆనంద్ కాంబినేషన్‌లో మరో మూవీ గా వస్తున్న ఈ చిత్రం కథ, కథనాలపై ఇండస్ట్రీలో అప్పుడే ఆసక్తికరమైన చర్చలు మొదలైయ్యాయి. నేడు (మే7, శుక్రవారం) సందీప్‌కిషన్ బర్త్ డే సందర్భంగా ఈ కొత్త సినిమాను ప్రకటించారు. అనౌన్స్ మెంట్ పోస్టర్‌లో సందీప్‌కిషన్ ఏదో ఒక మిస్టీరియస్ లొకేషన్‌ను ఐడెంటీఫై చేస్తున్నట్లుగా కనిపిస్తున్నారు. విభిన్న తరహా కథ, కథనాలు అందించే దర్శకుల్లో ఒకరిగా పేరు సంపాదించిన దర్శకుడు వీఐ ఆనంద్ ఈ సినిమాకు కూడా ఓ వినూత్నమైన, ప్రేక్షకులు ఊహించని కథను రెడీ చేశారు. ఈ రోజు బర్త్ డే జరుకుంటున్న సందీప్ కిషన్ సినీ జోష్ టీం తరపున ఏ వెరీ హ్యాపీ బర్త్ డే.