Advertisementt

అండర్ వరల్డ్ డాన్ కరోనాకి బలి

Fri 07th May 2021 04:55 PM
under world don,chhota rajan,died,covid-19,aiims  అండర్ వరల్డ్ డాన్ కరోనాకి బలి
Underworld don Chhota Rajan died due to Covid-19 అండర్ వరల్డ్ డాన్ కరోనాకి బలి
Advertisement
Ads by CJ

కరోనా మహమ్మారి చేతిలో బడా వ్యక్తులు లేదూ, సాధారణ ప్రజలు లేరూ. ఎవ్వరైనా ఒక్కటే. కరోనా కారణంగా చాలామంది పేరున్న సెలబ్రిటీస్ ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా బుల్లెట్లకు, ప్రభుత్వానికి, పోలీస్ లకి భయపడని అండర్ వరల్డ్ డాన్ ని కరోనా కబళించడం కలకలంగా మారింది. సెలెబ్రిటీ లేదూ, డాన్ లేదూ, గ్యాంగ్ స్టార్ లేదూ కరోనా కి దొరికితే ఇక అంతే. ఒకప్పుడు ప్రముఖ మాఫియా డాన్ దావుద్ ఇబ్రహీం కి కుడి భుజం, నమ్మకస్తుడైన మాఫియా డాన్ చోటా రాజన్ ఢిల్లీ ఎయిమ్స్ హాస్పిటల్ లో కరోనా చికిత్స తీసుకుంటూ కన్ను మూసాడు.

దావుద్ ఇబ్రహీం తో కొన్నాళ్ళు పని చేసిన చోటా రాజన్.. తర్వాత దావుద్ నుండి విడిపోయి ఒక గ్యాంగ్ కి గ్యాంగ్ స్టార్ గా తనని తాను ప్రకటించుకున్నాడు. 2015 లో ఇండోనేషియాలో అరెస్ట్ అయిన మాఫియా డాన్ చోటా రాజన్ ఇన్నిరోజులు తీహార్ జైల్లో ఊచలు లెక్కబెడుతున్నాడు. చోటా రాజన్ పై మహారాష్ట్రలో 70కి పైగా క్రిమినల్ కేసులున్నాయి. అయితే తీహార్ జైల్లో ఉన్న చోటా రాజన్ కి కొద్దీ రోజులు నుండి ఆరోగ్యం బాగోకపోవడంతో టెస్ట్ చేయించగా కరోనా పాజిటివ్ రాగా ఆయన్ని ఢిల్లీ ఎయిమ్స్ కి తరలించి చికిత్స అందించగా.. ఎంతో మందితో పోరాడి డాన్ గా ఎదిగిన చోటా రాజన్ కొద్ది గంటల ముందు చోటా కరోనా తో పోరాడలేక ప్రాణాలు విడిచాడు.

Underworld don Chhota Rajan died due to Covid-19:

Underworld don Chhota Rajan died due to Covid-19 at Aiims

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ