పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ ఆ మధ్యన సెకండ్ మ్యారేజ్ చేసుకోబోతుననట్లుగా చెప్పింది. ఆ తర్వాత ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్న రేణు దేశాయ్ మళ్ళీ ఆ రెండో పెళ్లి ముచ్చట తీసింది లేదు. ఇక ప్రస్తుతం దర్శకత్వంలో బిజీగా ఉన్న రేణు దేశాయ్ బుల్లితెర షోస్ కి జేడ్జ్ గా కూడా వస్తుంది. జీ తెలుగులో ప్రసారమవుతున్న డ్రామా జూనియర్స్ కి జేడ్జ్ గా రావడమే కాదు.. తన కూతురు ఆద్యని ఫస్ట్ టైం బుల్లితెర మీద ఎంట్రీ ఇప్పిస్తుంది. వచ్చే ఆదివారం డ్రామా జూనియర్స్ లో మదర్స్ డే సందర్భంగా పిల్లలు దానికి సంబందించిన స్కిట్స్ చేసిన ప్రమోని వదిలింది జీ తెలుగు.
అందులో ఓ స్కిట్ లో అమ్మాయి పుట్టిన కారణంగా ఓ భర్త భార్యని అస్సహించుకుంటూ వేధిస్తాడు. అంతేకాదు.. నీకు నేను కావాలంటే ఆ అమ్మాయిని వదిలేయ్ అంటూ వేధిస్తాడు. అది చూసిన రేణు దేశాయ్ చాలా ఎమోషనల్ గా ఫీలయ్యింది. ఎందుకంటే తన తండ్రి కూడా అక్క పుట్టిన తర్వాత నేను పుట్టడంతో మళ్ళీ అమ్మాయి పుట్టింది అంటూ అతను నా మొహం కూడా చూడలేదు.. అంటూ ఎమోషనల్ అవ్వగా.. తన కూతురు ఆద్య రేణు దేశాయ్ ని ఓదార్చే ప్రయత్నం చేసింది.