Advertisementt

నెటిజెన్స్ కి జడుస్తున్న హీరోయిన్స్

Fri 07th May 2021 10:39 AM
heroines,social media,looks,netizens,corona,second wave,pandemic time  నెటిజెన్స్ కి జడుస్తున్న హీరోయిన్స్
Heroines afraid of netizens నెటిజెన్స్ కి జడుస్తున్న హీరోయిన్స్
Advertisement
Ads by CJ

గత ఏడాది కరోనా లాక్ డౌన్ లో చాలామంది హీరోయిన్స్ సోషల్ మీడియాలో బాగా బిజీగా ఉండేవారు. ఎలా అంటే తమ అందమైన ఫొటోస్ ని, గ్లామరస్ ఫొటోస్ ని షేర్ చేస్తూ అభిమానులకి దగ్గరగా ఉండేవారు. రకుల్, కాజల్, బాలీవుడ్ హీరోయిన్స్ ఇలా చాలామంది సోషల్ మీడియాలో అందాల ఆరబోత ఫోటో షూట్స్ తో ఎంటర్టైన్ చేసేవాళ్ళు. తమ దగ్గ ఉన్న పాత ఫోటో షూట్స్ ని బయటికి తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తాము ఇంట్లో ఎలా గడుపుతున్నామో, ఈ లాక్ డౌన్ లో ఏం నేర్చుకున్నామో ఇవన్నీ సోషల్ మీడియా ద్వారా పంచుకునేవారు. అప్పట్లో అది నిజంగానే వర్కౌట్ అయ్యింది.

కానీ ఈ కరోనా సెకండ్ వేవ్ సిట్యువేషన్ లో హీరోయిన్స్ ఎవరూ తమ తమ ఫొటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చెయ్యాలంటే భయపడుతున్నారు. కారణం ఇలాంటి పాండమిక్ సిట్యువేషన్ లో ప్రజలకి హెల్ప్ చెయ్యాల్సింది పోయి హాట్ ఫొటోస్, గ్లామర్ ఫొటోస్ అంటూ సోషల్ మీడియాలో కూర్చుంటారా అని తిడరేమో అని. ఇంతకుముందు బాలీవుడ్ తారలంతా కరోనా సెకండ్ వేవ్ ఉధృతమవ్వకముందు మాల్దీవులకు వెకేషన్స్ అంటూ వెళ్లి.. బీచ్ వెంట బికినీలతో ఆడుకున్న ఫొటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చెయ్యడంతో నెటిజెన్స్ పెద్ద ఎత్తున ఆయా సెలబ్రిటీస్ ని ట్రోల్ చేసారు.

ఇక కొంతమంది సెలబ్రిటీస్ కూడా వారిపై విరుచుకుపడ్డారు. ఇలాంటి సిట్యువేషన్ లో వెకేషన్స్ కి వెళితే వెళ్లారు కానీ.. ఆ ఫొటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చెయ్యడమేమిటి అంటూ సదరు సెలబ్రిటీస్ మాల్దీవులకు వెళ్లిన వారిపై సెటైర్స్ కూడా వేశారు. అందుకే ఇప్పుడు భామలంతా కరోనా టైం లో కామ్ గా ఉందామని ఫిక్స్ అయ్యారు. లేదంటే నెటిజెన్స్ చేతిలో బుక్ అవుతామని భయపడుతున్నారు.

Heroines afraid of netizens:

Heroines Social media looks

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ