త్రివిక్రమ్ - మహేష్ కాంబోలో ఓ మూవీ తెరకెక్కబోతుంది. ఆ సినిమా ఈ నెల 31 న పూజా కార్యక్రమాలతో మొదలు కాబోతుంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఆరోగ్యం రీత్యా ఏకే రీమేక్ వాయిదా పడడంతో.. ఆ సినిమా కి అన్ని తానై చూసుకుంటున్న త్రివిక్రమ్ ఫ్రీ అవడంతో.. మహేష్ తో చెయ్యబోయే సినిమా ఫుల్ స్క్రిప్ట్ పనుల్లో బిజీగా వున్నాడు. అయితే ఈ సినిమాలో మహేష్ కాకుండా మరో హీరో ఉంటాడని అంటున్నారు. మరోపక్క మహేష్ కి జోడిగా హీరోయిన్ పూజా హెగ్డే ఫిక్స్ అనే వార్తలొస్తున్నాయి.
ఇక ఇప్పుడు ఈ సినిమాలో అంటే త్రివిక్రమ్ సెంటిమెంట్ ప్రకారం రెండో హీరోయిన్ కూడా ఉండబోతుందట. త్రివిక్రమ్ సినిమాల్లో ఆయన సెంటిమెంట్ ప్రకారం ఇద్దరు హీరోయిన్స్ ఉంటారు. అందులో మొదటి హీరోయిన్ కి వచ్చిన స్టార్ డం సెకండ్ హీరోయిన్ కి రాకపోగా.. మళ్లీ సినిమా అవకాశాల కోసం పరుగులు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. అలానే జల్సా లో కమలిని ముఖర్జీ, సన్ అఫ్ సత్యమూర్తి లో అదః శర్మ, ఇంకా అజ్ఞాతవాసి లో అను ఇమ్మాన్యువల్, అరవింద సమేతలో ఈషా రెబ్బ లేటెస్ట్ మూవీ అలా వైకుంఠపురములో నివేత పేతురేజ్ ల కెరీర్ ని చూసాక త్రివిక్రమ్ మూవీలో సెకండ్ హీరోయిన్ ఛాన్స్ వచ్చినా చెయ్యరు.
కానీ త్రివిక్రమ్ - మహేష్ అంటే ఆలోచిస్తారు. ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ తో హరి హర వీరమల్లు లో నటిస్తున్న నిధిగా గర్వాల్ కి SSMB28 లో నటించే ఛాన్స్ వచ్చింది అంటుంటే.. అమ్మో నిధి అగర్వాల్ ఒప్పుకుంటే త్రివిక్రమ్ సెంటిమెంట్ కి బలే అంటున్నారు ఆమె ఫాన్స్.