కరోనా సెకండ్ వేవ్ కారణముగా షూటింగ్ ఫినిష్ చేసుకుని రిలీజ్ కి రెడీ అయిన చాలా సినిమాలు పోస్ట్ పోన్ అయ్యాయి. అందులో లవ్ స్టోరీ, నాని టక్ జగదీశ్, రానా విరాట పర్వం మూవీ లు ఉండగా.. ఇంకా షూటింగ్ పూర్తవని కారణంగా చిరు ఆచార్య, రవితేజ ఖిలాడీ మూవీలని అధికారికంగా వాయిదా వేశారు. ఎలాగూ మే నెలలో థియేటర్స్ ఓపెన్ అయ్యే ఛాన్స్ లేదు కాబట్టి తమ సినిమాలని వాయిదా వేశారు సదరు దర్శకనిర్మాతలు. కానీ జూన్ లో జులై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ లలో సినిమా రిలీజ్ డేట్స్ ఇచ్చిన హీరోలెవరూ తమ సినిమాలను పోస్ట్ పోన్ చేస్తున్నట్టుగా ఇంతవరకు అనౌన్స్ చేసింది లేదు.
కానీ అనిల్ రావిపూడి మాత్రం తమ ఎఫ్ 3 ఆగష్టు లో రావడం లేదని డిక్లెర్ చేసేసాడు. వెంకటేష్ నారప్ప, దృశ్యం 2 మూవీ షూటింగ్స్ కంప్లీట్ చేసి ఎఫ్ 3 షూటింగ్ కి హాజరవుతున్నా, వరుణ్ తేజ్ కూడా డేట్స్ చూసుకుని ఎఫ్ 3 షూటింగ్ కి వస్తున్నా అనిల్ రావిపూడి కి కరోనా సోకడంతో ఎఫ్ 3 షూటింగ్ వాయిదా పడింది. అనిల్ రావిపూడి కి కరోనా తగ్గినా.. ప్రస్తుతం షూటింగ్ మొదలు పెట్టే పరిస్థితులు లేకపోవడం.. మళ్లీ షూటింగ్ మొదలయ్యే సమయానికి ఎఫ్ 3 లో నటిస్తున్న నటుల డేట్స్ చూసుకోవాలి కాబట్టి సినిమాని ఆగస్టు లో రిలీజ్ చెయ్యలేమని అనిల్ రావిపూడి చెప్పేసాడు.