అల్లు అర్జున్ - సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న పుష్ప పాన్ ఇండియా షూట్ మొత్తం మీద కరోనా వలన పోస్ట్ పోన్ అయ్యింది. గత ఏడాది కరోనా కకావికలంతో పోస్ట్ పోన్ అయిన పుష్ప షూటింగ్ ని ఈ సెకండ్ వేవ్ లో ఎలాగైనా కానిచ్చేయాలనుకున్నా.. కరోనా ఊరుకోలేదు. అల్లు అర్జున్ కరోనా బారిన పడడం, విలన్ ఫహద్ ఫాజిల్ కూడా వెళ్లిపోవడంతో పుష్ప షూటింగ్ వాయిదా పడింది. యూట్యూబ్ రికార్డుల వేటలో పుష్ప టీజర్ ఉండగా ఇప్పుడు పుష్ప మూవీ ఫై ఓ సూపర్ గాసిప్ తెరపైకి వచ్చింది. అదేమిటంటే.. పుష్ప సినిమాని సుకుమార్ రెండు పార్ట్ లుగా రిలీజ్ చేయబోతున్నాడట.
ఎర్రచందనం స్మగ్లింగ్ అనేది చాలా సీరియస్ అయిన చాలా పెద్ద అంశం కాబట్టి.. పుష్ప ని రెండు పార్ట్ లు గా తెరకెక్కస్తున్నారట. సుకుమార్ ఈ సినిమాని రెండు పార్ట్ లు గా చెయ్యాలని చెప్పడం దానికి అల్లు అర్జున్ ఓకె చెప్పడంతో.. ఈ ఏడాది ఆగష్టు లో ఒక పార్ట్ ని విడుదల చేసి రెండో పార్ట్ ని వచ్చే ఏడాది లో విడుదల చేసే ప్లాన్స్ లో సుక్కు అండ్ బన్నీలు ఉన్నారట. అందుకే బన్నీ ఈ ఏడాది పుష్ప షూటింగ్ తో బిజీగా ఉంటాడు కాబట్టి కొరటాల ఎన్టీఆర్ మూవీకి ఓకె చెప్పేశాడట. కొరటాల - ఎన్టీఆర్ మూవీ అయ్యేలోపు పుష్ప సెకండ్ పార్ట్ కూడా పూర్తవుతుంది అని అల్లు అర్జున్ కొరటాలని బయటికి వెళ్ళడానికి ఒప్పుకున్నట్లుగా ఫిలింనగర్ టాక్.