ప్రస్తుతం టాలీవుడ్ సీనియర్ హీరోలకి హీరోయిన్స్ దొరకడం కష్టంగా మారింది. చిరు, నాగార్జున లాంటి వాళ్ళకి కాజల్ లాంటి వాళ్ళు ఓకె చెప్పినా బాలకృష్ణ కి మాత్రం హీరోయిన్స్ దొరకడం గగనం అవుతుంది. బాలకృష్ణ రీసెంట్ మూవీస్ చూస్తే ఆ విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. బాలకృష్ణ తో నటించేందుకు ఏ హీరోయిన్ కూడా ముందుకు రావడం లేదు. బోయపాటి - బాలకృష్ణ కాంబోలో తెరకెక్కిన సింహ లో నయనతార ని తీసుకొచ్చిన బోయపాటి లెజెండ్ లో రాధికా ఆప్టే, సోనాల్ చౌహన్ లతో పని కానిచ్చేశాడు. ఇక ఇప్పుడు వాళ్ళ కాంబోలో వస్తున్న BB3 అఖండ కి హీరోయిన్స్ విషయంలో బోయపాటి పడిన టెంక్షన్ అంతా ఇంతా కాదు. చివరికి పూర్ణ, ప్రగ్య జైస్వాల్ తో సర్దుకుపోవాల్సి వచ్చింది. అయితే బాలకృష్ణ అఖండ తర్వాత గోపీచంద్ మలినేని తో మరో మూవీ చెయ్యబోతున్నాడు.
గోపీచంద్ - బాలకృష్ణ కాంబో మూవీకి బాలకృష్ణ కోసం గోపీచంద్ మలినేని రీసెంట్ గా రవితేజ క్రాక్ సినిమాలో శృతి హాసన్ ని తీసుకుని ఆమెతో ఫైట్ కూడా చేయించి హిట్ కొట్టి ఉండడంతో.. ఇప్పుడు బాలయ్య కోసం మరోసారి శృతి హాసన్ నే రిపీట్ చేయబోతున్నాడట. మరి ఈమధ్యన శృతి హాసన్ రవితేజ క్రాక్, పవన్ వకీల్ సాబ్ సినిమాల్లో నటించింది. లుక్స్ పరంగా విమర్శలు ఎదుర్కుంటున్న శృతి హాసన్ ప్రభాస్ పాన్ ఇండియా మూవీ సలార్ లో నటిస్తుంది. మరి గోపీచంద్ అడిగాడు కదా అని బాలకృష్ణ కి ఓకె చెప్పేస్తుంది? అసలే బాలయ్య పక్కన సీనియర్ హీరోయిన్స్ కూడా నటించడం లేదు. అలాంటి టైం లో శృతి హాసన్ లుక్స్ పరంగా ఎలా ఉన్నా.. తనకి హిట్ ఇచ్చిన డైరెక్టర్ కోసం బాలయ్య తో మూవీ చెయ్యడానికి ఒప్పేసుకుంటుందా? ఒక్కసారి సీనియర్ హీరోలకి ఓకె చెబితే ఇక శృతి ని ఏ స్టార్ హీరో కూడా పట్టించుకోరు. అందుకే ఆమె ఓకె చెబుతుందా? నో చెబుతుందా? అనేది ఇపుడు ఇంట్రెస్టింగ్ గా మరింది.