హరీష్ శంకర్ - పవన్ కళ్యాణ్ కాంబోలో తెరకెక్కబోయే PSPK28 ప్రీ ప్రొడక్షన్ పనులని హారిష్ శంకర్ చకచకా పూర్తి చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ ఏకే రీమేక్, హరిహర వీర మల్లు షూటింగ్ లు త్వరగా కంప్లీట్ చేసేసి హరీష్ శంకర్ మూవీకి రెడీ అయితే హరీష్ పవన్ కోసం ఫుల్ స్క్రిప్ట్ అండ్ అన్ని పనులు రెడీ చేసి పెట్టుకోవాలి కాబట్టి హారిష్ ఆ పనుల్లో బిజీగా ఉన్నాడట. అందుకే పవన్ తో నటించబోయే హీరోయిన్, నటుల ఎంపికని కూడా హరీష్ పూర్తి చేసేస్తున్నాడు. హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ కోసం.. అప్పుడే హీరోయిన్ ని కూడా సెట్ చేసినట్లుగా తెలుస్తుంది.
దువ్వాడ జగన్నాథం, గద్దలకొండ గణేష్ సినిమాల తర్వాత మరోసారి పూజ హెగ్డే ని తన మూడో సినిమా కోసం రిపీట్ చేయబోతున్నాడట. అంటే పవన్ కళ్యాణ్ - హారిష్ కాంబో PSPK28 హీరోయిన్ ఫైనల్ గా పూజ హెగ్డే ని ఫిక్స్ చేసినట్లే అంటున్నారు. డీజే ద్వారా స్టార్ డం సంపాదించిన పూజ హెగ్డే కి హారిష్ అంటే మంచి గురి ఉంది. కాబట్టే టాప్ రేంజ్ లో ఉన్నప్పుడు కూడా హరీష్ శంకర్ అడిగాడు కదా అని గద్దలకొండ గణేష్ లో గెస్ట్ రోల్ ప్లే చేసింది. ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ కోసం మరోసారి పూజ హెగ్డే నే హరీష్ ఎంపిక చేసినట్లుగా తెలుస్తుంది. పవన్ - హరీష్ మూవీ షూటింగ్ కి వెళ్లేముందు పూజ హేగ్డ్ పేరుని అధికారికంగా ప్రకటిస్తారని తెలుస్తుంది.