రీసెంట్ గా త్రివిక్రమ్ - మహేష్ బాబు కాంబోలో SSMB28 మూవీ సెట్ అయ్యి.. అధికారిక ప్రకటన కూడా వచ్చిన విషయం తెలిసిందే. త్రివిక్రమ్ కి అలా వైకుంఠపురములో మూవీ తర్వాత వెంటనే ఎన్టీఆర్ తో చేసే ఛాన్స్ వచ్చినా.. అది కొన్ని కారణాల వలన కార్యరూపం దాల్చలేదు. త్రివిక్రమ్ కి తరవాత మహేష్ తో మూవీ రెడీ అయ్యింది. ప్రస్తుతం త్రివిక్రమ్ మహేష్ కి లైన్ చెప్పి ఒప్పించాడట. ఇక ఫుల్ స్క్రిప్ట్ కూడా త్వరలోనే మహేష్ తో ఓకె చేయించుకుని.. ఈ సినిమా ని మే 31న పూజా కార్యక్రమాలతో మొదలు పెట్టబోతున్నారని తెలుస్తుంది. ఇక ఈ సినిమా టైటిల్ గా అతడు లో మహేష్ పేరు పార్థు నే ఇప్పుడు త్రివిక్రమ్ - మహేష్ కాంబో మూవీకి వినిపిస్తుంది.
అయితే ఇప్పుడు త్రివిక్రమ్ - మహేష్ సినిమాలో మరో హీరో పాత్ర కూడా ఉంటుందట. అలా వైకుంఠపురములో సినిమాలో అల్లు అర్జున్ కాకుండా మరో కీ రోల్ లో అక్కినేని హీరో సుశాంత్ కనిపించినట్టుగానే.. ఇప్పడు మహేష్ - త్రివిక్రమ్ చెయ్యబోయే సినిమాలో కూడా అలా ఇంపార్టెంట్ రోల్ ఒకటి ఉందట. దాని కోసం ఒక హీరో కావాలి. మరి ఈ అవకాశం మహేష్ కాంపౌండ్ హీరో, మహేష్ బావ అయిన సుధీర్ బాబు కి వస్తుందా? ఎప్పటినుండో మహేష్ తో స్క్రీన్ షేర్ చేసుకోవాలని తహతహలాడుతున్న సుధీర్ కి ఆ ఛాన్స్ తగులుతుందా? త్రివిక్రమ్ సుధీర్ బాబు ని ఛూజ్ చేసుకుంటాడా? లేదంటే మరో హీరో ఎవరినైనా తీసుకువస్తాడా? అనేది చూడాలి.