Advertisementt

ప్రెగ్నెన్సీపై ఇలియానా హాట్ కామెంట్స్

Wed 05th May 2021 06:44 PM
ileana,pregnancy,bollywood rumours,pregnancy and abortion,fake and baseless,attempted suicide  ప్రెగ్నెన్సీపై ఇలియానా హాట్ కామెంట్స్
Ileana about her pregnancy ప్రెగ్నెన్సీపై ఇలియానా హాట్ కామెంట్స్
Advertisement
Ads by CJ

ఈమధ్యన గోవా బ్యూటీ ఇలియానా తన సినిమాల విషయాల కన్నా ఎక్కువగా పర్సనల్ విషయాలపై ఫోకస్ పెట్టినట్టుగా ఉంది. ఏ ఇంటర్వ్యూ కి వెళ్ళినా పర్సనల్ విషయాలతో సింపతీ కొట్టెయ్యాలనే ప్లాన్ లో ఉన్నట్లుగా కనిపిస్తుంది. ఇలియానా మొన్నామధ్యన బాడీ షేమింగ్ విషయంలో ఎంతగా అవమాన పడిందో చెప్పింది. ఇక తాజాగా గతంలో తనపై వచ్చిన గాసిప్స్ కి ఇన్నాళ్ళకి తెర దించింది. బాలీవుడ్ సినిమాలు చేస్తూ బాయ్ ఫ్రెండ్ ఆండ్రు తో కొన్నాళ్ళు డేటింగ్ చేసిన ఇలియానా తర్వాత బ్రేకప్ చేసుకుంది.. బాగా బరువు పెరిగింది. 

ఎప్పుడూ నాజూగ్గా ఉన్న ఇలియానా ఒక్కసారిగా బరువు పెరగడంతో.. ఆండ్రు తో డేటింగ్ లో ఉన్నప్పుడు ఆమెకి ప్రెగ్నెన్సీ వచ్చింది అని, అలాగే అబార్షన్ కూడా అయ్యింది అనే ప్రచారం జరిగింది. అయితే ఇలియానా అప్పుడు తనపై జరిగిన ప్రచారానికి రీసెంట్ గా చెక్ పెట్టింది. తాను ఆండ్రు తో డేటింగ్ చేసినప్పుడు ప్రెగెన్సీ వచ్చింది అని, అలాగే అబార్షన్ అయ్యింది అనే విషయాలు నిజం కాదని, తాను ఆండ్రు తో డేటింగ్ చేసిన తర్వాత విడిపోయాక.. అందరి అమ్మాయిల్లాగే  డిప్రెషన్ లోకి వెళ్ళాను అని చెప్పింది.

అప్పుడే బరువు పెరిగా అని, ఇక నేను సూసైడ్ చేసుకుంటుంటే.. మా పనిమనిషి ఆపింది అని, ఆమె నన్ను సేవ్ చేసింది అని కూడా అన్నారు. కానీ నాకు పని మనిషి లేదు. నేను ఎలాంటి సూయిసైడ్ ఎటెంప్ట్ కూడా చెయ్యలేదు. నాపై అలాంటి గాసిప్స్ వచ్చినప్పుడు నేను షాకయినా నా గురించి ఇలాంటి వార్తలు రాయడం చూసి వింతగా అనిపించింది అంటూ చెప్పుకొచ్చింది ఇలియానా.

Ileana about her pregnancy :

Ileana says I was pregnant and underwent abortion. All those are fake and baseless

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ