Advertisementt

ఆ హీరోతో నటిస్తున్నందుకు పూజ ఎగ్జైట్మెంట్

Wed 05th May 2021 03:20 PM
pooja hegde,bollywood,tollywood,pooja hegde photos,pooja hegde tested corona positive,salman khan  ఆ హీరోతో నటిస్తున్నందుకు పూజ ఎగ్జైట్మెంట్
Pooja Hegde comments on Bollywood hero ఆ హీరోతో నటిస్తున్నందుకు పూజ ఎగ్జైట్మెంట్
Advertisement
Ads by CJ

పూజాహెగ్డే ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోలందరితో నటించి నెంబర్ వన్ స్థానంలో ఉన్న హీరోయిన్. ప్రస్తుతం కరోనా పాజిటివ్ తో హోమ్ క్వారంటైన్ లో రెస్ట్ తీసుకుంటున్న పూజ హెగ్డే అటు పాన్ ఇండియా మూవీస్ ఇటు స్టార్ హీరోల మూవీస్ తో దూసుకుపోతుంది. ఇప్పుడు బాలీవుడ్ లోనూ బిజీ తారగా మారిపోయింది. మరోపక్క తమిళ స్టార్ హీరో విజయ్ తో కూడా నటించేస్తుంది. అయితే 2019 లో బాలీవుడ్ లో హిట్ మూవీస్ లో నటించిన పూజ హెగ్డే కి అక్కడ స్టార్ హీరోల సినిమాలు తగిలాయి. సల్మాన్ ఖాన్, రన్వీర్ సింగ్ ఇలా వరస సినిమాలతో బాలీవుడ్ లోనూ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మరింది.

అయితే కోవిడ్ వలన తనకి ఎంతో ఇష్టమైన సల్మాన్ ఖాన్ షూటింగ్ ని బాగా మిస్ అవుతున్నా అంటుంది. కోవిడ్ లేకపోతే సల్మాన్ ఖాన్ తో నటించే కభీ ఈద్ కభీ దీవాలి మూవీ ఈ రంజాన్ కి విడుదలయ్యేదని.. కరోనా కారణంగా ఇంకా షూటింగ్ పూర్తి చేసుకోలేదని చెబుతుంది. ఇక సల్మాన్ ఖాన్ అంటే చాలా ఇష్టమని.. ఆయనతో సినిమా చెయ్యడం బావుంది అని చెప్పిన పూజ హెగ్డే.. సెట్స్ లో ఉన్నప్పుడు సల్మాన్ ఖాన్ తో చాలా మాట్లాడినా.. ఇంకా మాట్లాడాల్సిన మాటలు ఉన్నాయని, ఆయనతో కలిసి నటించడం చాలా గొప్ప అనుభవం అని చెబుతుంది. తాను - సల్మాన్ ఖాన్ కాంబోలో కాంబోలో రాబోయే కభీ ఈద్ కభీ దీవాలి మూవీ చూసి ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారంటుంది.

Pooja Hegde comments on Bollywood hero:

Pooja Hegde talks about working with Salman Khan

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ