Advertisementt

తెలంగాణ ప్రభుత్వానికి హై కోర్టు అల్టిమేటం

Wed 05th May 2021 12:40 PM
high court,cm kcr,telangana govt,decide,night curfew,weekend lockdown  తెలంగాణ ప్రభుత్వానికి హై కోర్టు అల్టిమేటం
Telangana High Court Directs KCR Govt to Decide on Weekend lockdown తెలంగాణ ప్రభుత్వానికి హై కోర్టు అల్టిమేటం
Advertisement

కరోనా కట్టడిలో చాలా రాష్ట్రాలు లాక్ డౌన్, నైట్ కర్ఫ్యూలు అమలు చేస్తున్నాయి. ఏపీ, ఢిల్లీ, మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్, యూపీ వంటి రాష్ట్రాలు లాక్ డౌన్, కర్ఫ్యూలు అమలు చేస్తున్నాయి. అయితే తెలంగాణ ప్రభుత్వం కరోనా కట్టడిలో విఫలయ్యింది  అంటూ తెలంగాణ హై కోర్టు ఎప్పటికప్పుడు ప్రభుత్వాన్నిహెచ్చరిస్తూనే ఉంది. నైట్ కర్ఫ్యూ, వీకెండ్ లాక్ డౌన్ పై నిర్ణయం తీసుకోకుంటే మేమే నిర్ణయం తీసుకుంటామని హెచ్చరించాక కానీ తెలంగాణ ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ పెట్టలేదు. అలాగే నైట్ కర్ఫ్యూ పొడిగించే విషయంలోనూ హై కోర్టు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. 

ఇక తెలంగాణ సీఎం కేసీఆర్ కరోనా నుండి కోలుకోవడంతో ఈ రోజు ఆన్ లైన్ లో మీటింగ్ నిర్వహించి తెలంగాణాలో కరోనా పరిస్థితులు అంచనా వేసి ఓ నిర్ణయం తీసుకునే లోపే తెలంగాణ హై కోర్టు ప్రభుత్వం పై ఘాటైన వ్యాఖ్యలు చేసింది. తాజాగా హై కోర్టు తెలంగాణ ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసింది. కరోనా కట్టడిలో తెలంగాణ ప్రభుత్వం అడుగడుగునా ఫెయిలమవుతుంది అని, అసలు వీకెండ్ లాక్ డౌన్స్ పై ఎందుకు నిర్ణయం తీసుకోవడం లేదు, పెళ్లిళ్లు, అంత్యక్రియలకు వచ్చే జనాల్ని ఎందుకు నియంత్రించలేకపోతున్నారు, నైట్ కర్ఫ్యూ టైమింగ్స్ పెంచాలని, అలాగే వీకండ్ లాక్ డౌన్స్ పై వెంటనే అంటే మే 8 లోపు నిర్ణయం తీసుకోవాలంటూ.. ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసింది హై కోర్టు. 

Telangana High Court Directs KCR Govt to Decide on Weekend lockdown:

High Court Asks Telangana Govt to Decide on Weekend lockdown

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement