ఫలక్ నుమా దాస్ తో హీరోగా, డైరెక్టర్ గా, ప్రొడ్యూసర్ గా ఇలా ఒకేసారి మల్టి టాలెంట్స్ చూపించిన యంగ్ హీరో విశ్వక్ సేన్.. ప్రస్తుతం పాగల్ మూవీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నాడు. కరోనా సెకండ్ వేవ్ లేకపోతె విశ్వక్ పాగల్ తో యూత్ కి పిచ్చెక్కించేవాడే. పాగల్ రిలీజ్ చేసేద్దామనే ఉద్దేశ్యంతో విశ్వక్ సేన్ పాగల్ ప్రమోషన్స్ ని గట్టిగానే చేసాడు. రానా నెంబర్ వన్ యారి షో, జబర్దస్త్, అలీ తో సరదాగా షోస్ తో పాగల్ ప్రమోషన్స్ చేపట్టాడు. ఇక అలీ తో సరదాగా ప్రోగ్రాం లో విశ్వక్ సేన్ చాలా విషయాలనే రివీల్ చేసాడు.
అందులో విజయ్ దేవరకొండ తో గొడవ విషయం ఫస్ట్ టైం స్పందించిన విశ్వక్ సేన్.. ఎవరి సహకారం లేకుండా పైకి లేవగలను, ఎదగగలను అంటూ చెప్పాడు. విశ్వక్ సేన్ ని అలీ గారు మరి అవకాశం వస్తే విలన్ రోల్ ప్లే చేస్తారా అనగానే కొత్త హీరో, కథ బావుంటే విలన్ కేరెక్టర్ చెయ్యడానికి ఆలోచించను అని చెబుతున్నాడు. తాను కథ, అందులోని పాత్రలను బట్టి సినిమాలు ఎంచుకుంటా అని.. రెమ్యునరేషన్ కి పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వను అని చెబుతున్నాడు విశ్వక్ సేన్.
తనకి కోపం కాస్త ఎక్కువే అని, నా యాటిట్యూడ్ వలన అవకాశాలు పోగొట్టుకుంటా అంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదంటున్నాడు. అయితే కోపం వస్తే మాత్రం ఫోన్ పగలగొడుతుంటా అని, అది కూడా ఐ ఫోన్ అంటూ షాకిచ్చాడు విశ్వక్ సేన్. మరి ఐ ఫోన్ అంటే సాదా సీదా ఫోన్ కాదు కదా.. చాలా కాస్ట్లీ ఫోన్. అయినా విశ్వక్ కోపానికి ఐ ఫోన్స్ పగుతూలుతున్నాయంటే అతని కోపం చాలా కాస్ట్లీ సుమీ.