Advertisementt

ఆ ముగ్గురిలో ఎవరు పవన్ కి?

Tue 04th May 2021 09:55 PM
nithya menen,keerty suresh,anupama parameswaran,pawan kalyan ak remake,pawan and rana combo,trivikram  ఆ ముగ్గురిలో ఎవరు పవన్ కి?
Nithya Menen comes into picture for Pawan Ak Remake ఆ ముగ్గురిలో ఎవరు పవన్ కి?
Advertisement
Ads by CJ

పవన్ కళ్యాణ్ - రానా కాంబోలో శేఖర్ కే చంద్ర తెరకెక్కిస్తున్న ఏకే రీమేక్ షూటింగ్ పవన్ కి కరోనా కారణంగా వాయిదా పడింది. అలాగే సెకండ్ వేవ్ ఉధృతి కారణంగా పొల్లాచ్చిలో జరగాల్సిన ఈ షెడ్యూల్ ని ప్రస్తుతం పోస్ట్ పోన్ చేసింది టీం. అయితే ఈ సినిమాలో రానా కి భార్య ప్లేస్ లో ఇప్పటికే ఐశ్వర్య రాజేష్ ని ఎంపిక చేసింది టీం. కానీ పవన్ కళ్యాణ్ వైఫ్ గా ఇంతవరకు హీరోయిన్ సెట్ కాలేదు. అప్పట్లో సాయి పల్లవి పేరు గట్టిగా వినిపించినా ప్రస్తుతం అంటే గత రెండు రోజులుగా ఏకే రీమేక్ లో పవన్ భార్యగా నిత్య మీనన్ నటించబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది. నిజానికి నిత్య మీనన్ కూడా పవన్ భార్య కేరెక్టర్ కి ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. 

ఇప్పటికి కూడా కీర్తి సురేష్ డేట్స్ ఇస్తుందనే ఆశతోనే ఏకే రీమేక్ టీం ఉంది. ఎందుకంటే కీర్తి సురేష్ ఓ 15 రోజుల డేట్స్ అడ్జెస్ట్ చేస్తే వర్కౌట్ అవుతుంది అనేది ఏకే రీమేక్ టీం కన్నా ఎక్కువ ఈ సినిమాని హ్యాండిల్ చేస్తున్న త్రివిక్రమ్ ఆలోచన. ఎందుకంటే ఈ సినిమాకి సంబందించిన అన్ని విషయాలని త్రివిక్రమే దగ్గరుండి చూసుకుంటున్నారు.

అందుకే త్రివిక్రమ్ ఇప్పటికీ కీర్తి సురేష్ దగ్గరే ఉన్నాడు. ఆమె  15 డేట్స్ అడ్జెస్ట్ చేస్తే బావుండు అని. ఈ కీర్తి సురేష్ కాకపోతే.. త్రివిక్రమ్ దగ్గర ఉన్న మరో ఆబ్లికేషన్ అనుపమ పరమేశ్వరన్. అ..ఆ సినిమా నుండి అనుపమ త్రివిక్రమ్ నుండి వచ్చే మరో పిలుపు కోసం ఎదురు చూస్తుంది. ఈ లెక్కన ఏకే రీమేక్ లో పవన్ వైఫ్ కేరెక్టర్ అనుపమ పరమేశ్వరన్ కి కూడా దక్కే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక నిత్య మీనన్ అనేది ఒక ఆప్షన్. ముగ్గురిలో చివరికి ఏకే రీమేక్ లో పవన్ సరసుకి చేరేదెవరో చూద్దాం.

Nithya Menen comes into picture for Pawan Ak Remake:

Nithya Menen comes into picture for Pawan and Rana

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ