ఈటెల రాజేంద్ర భూ కబ్జా ఆరోపణల్లో మంత్రి పదవిని పోగొట్టుకుని ప్రభుత్వంపై జమున హ్యాచరీస్ భూముల్లో అనుమతి లేకుండా అధికారులు సర్వే చేసారంటూ కోర్టు కెక్కడం, కేసీఆర్ ఫామ్ హౌస్ పై ఈటెల చేసిన వ్యాఖ్యలకు, అలాగే టీఆరెస్ పార్టీ ఎవడబ్బా సొత్తు కాదని, తెలంగాణ ప్రజలు తనని అస్సహించుకునేలా చేసారని.. కేసీఆర్ ని దొర ఆంటూ సంభోదించడంతో టీఆరెస్ నేతలు ఈటెలపై ఎదురు దాడికి దిగారు. బోయిన్ పల్లి ఎంపీ వినోద్, మంత్రి గంగుల ప్రెస్ మీట్ పెట్టి మరీ ఈటెలపై విరుచుకుపడ్డారు. అసలు ఈటెల రాజేంద్ర టీఆరెస్ పార్టీ పెట్టినప్పుడు లేరని, టీఆరెస్ 2004 ఎన్నికల్లో అధిక సీట్లు గెలుస్తుంది అనే కారణంతోనే టీఆరెస్ లో చేరారని, ఈటెల బిసి ముసుగులో ఉన్న దొర అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు.
కేసీఆర్ ని దొర అని ఈటెల అనడం కరెక్ట్ కాదని, అసలు ఈటెలకు ప్రతిపక్ష నాయకులతో చీకటి ఒప్పందాలు ఉన్నాయని, రాజకీయాల్లోకి వచ్చాక ఈటెల అన్ని వేల ఎకరాలు ఎలా సంపాదించారు.. హుజురాబాద్ వెళితే బిసి నేత, హైదరాబాద్ వస్తే ఓసి నేత అంటూ ఈటెలని విమర్శిస్తున్నారు. బిసి నేత ముసుగులో భూ ఆక్రమణకు ఈటెల పాల్పడ్డారని.. వినోద్, గంగుల ఈటెలపై విరుచుకుపడ్డారు. ప్రభుత్వ భూములను కొనడం, అమ్మడం నేరమని, బడుగు బలహీన వర్గాలు అమ్మినా ఆ భూములు చెల్లవని టీఆరెస్ నేతలు స్పష్టం చేసారు. ఈటెల రాజేంద్ర ఏం చేసినా చూస్తూ ఊరుకోమంటూ హెచ్చరించారు.
ఈటెల రాజేంద్ర కి టీఆరెస్ పార్టీలో గౌరవం దక్కలేదనేది అవాస్తవం, ఆయనని ఎవరూ అవమానించలేదు. ఈటీకి టీఆరెస్ లో అత్యంత ప్రాధాన్యతనిచ్చారు. పార్టీ ఉద్యమంలో ఉన్నవారికి మంత్రి పదవులు ఇచ్చారు. ఇచ్చిన మంత్రి పదవిని ఈటెల దుర్వినియోగం చేసారు. సందర్భం వచ్చినప్పుడల్లా ఈటెల కేసీఆర్ కి వ్యతిరేఖంగా మట్లాడడం కరెక్ట్ కాదు అంటూ ఈటెలపై టీఆరెస్ మంత్రులు మొదటిసారి స్పందించారు.