నితిన్ - రష్మిక మందన్న జంటగా వెంకీ కుడుములు తెరకెక్కించిన భీష్మ గత ఏడాది ఫిబ్రవరి 20 న విడుదలై సూపర్ హిట్ టాక్ తో బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ తో దూసుకుపోయింది. ఆ దెబ్బకి వెంకీ కుడుములకి స్టార్ హీరోలు ఛాన్స్ ఇచ్చేస్తారని, మెగాస్టార్ కూడా భీష్మ సినిమా చూసి మెచ్చుకోవడంతో వెంకీ కుడుములు రామ్ చరణ్ కి కథ చెప్పి ఒప్పిస్తున్నాడనే టాక్ సోషల్ మీడియాలో భీభత్సంగా స్ప్రెడ్ అయ్యింది. ఇక మెగా కాంపౌండ్ హీరోతోనే వెంకీ నెక్స్ట్ మూవీ అనుకున్నారు. మధ్యలో రామ్ ఇతర హీరోలు పేర్లు వినిపించినా.. వెంకీ కుడుములు మాత్రం భీష్మ తర్వాత ఎక్కడా కనిపించింది లేదు.
అయితే తాజాగా వెంకీ కుడుములకి ఉప్పెన హీరో తో సినిమా సెట్ అవ్వబోతుందట. ఉప్పెన లో అదిరిపోయే నటనతో ఆకట్టుకున్న వైష్ణవ్ తేజ్ వరస కమిట్మెంట్స్ తో బిజీ అయ్యాడు. ఇప్పటికే వైష్ణవ్ తేజ్ రెండు ప్రాజెక్ట్స్ ని లైన్ లో పెట్టగా.. ఇప్పుడు వెంకీ కుడుములతో కూడా మరో మూవీ కమిట్ అవ్వబోతున్నాడట. నితిన్ కి మంచి హిట్ ఇచ్చిన వెంకీ కుడుములతో వైష్ణవ్ తేజ్ మూవీ అనగానే మెగా ఫాన్స్ లో ఉత్సాహం మొదలయ్యింది. అయితే ఎప్పటినుండో మెగా కాంపౌండ్ లోనే వెంకీ ఉండడంతో.. ఇలా వైష్ణవ్ తేజ్ మూవీ సెట్ అయ్యింది అంటున్నారు.