2017 లో రిలీజ్ అయ్యి తమిళంలో సెన్సేషనల్ హిట్ అయిన సినిమా విక్రమ్ వేద. విజయ్ సేతుపతి - మాధవన్ పోటాపోటీగా నటించిన ఈ సినిమా పట్ల అన్ని వర్గాల ప్రేక్షకులు హర్షం వ్యక్తం చేసారు. తమిళంలో చాలా పెద్ద హిట్ అయ్యింది. ఒక సినిమా తమిళంలో హిట్ అవగానే రీమేక్ రైట్స్ కోసం ఎగబడే మన తెలుగు నిర్మాతలు కానీ, ఇతర భాషల వాళ్ళు కానీ ఈ విక్రమ్ వేద విషయంలో అలా ఎందుకు ఎగబడలేదు అంటే.. అలాంటి కాంబినేషన్ హీరోలని సెట్ చెయ్యలేక.. అలాగే విక్రమ్ వేద ని డబ్ కూడా చెయ్యకుండా రీమేక్ చెయ్యాలనే పట్టుదలతోనే అలానే ఉంచేశారు.
అయితే విక్రమ్ వేద మూవీ రీమేక్ రైట్స్ సంగతి ఎలా ఉన్నా.. తెలుగులో విక్రమ్ వేద ని రీమేక్ చెయ్యబోయే హీరోల పేర్లు చాలానే తెరపైన చక్కర్లు కొట్టాయి. రానా - రవితేజ, రవితేజ - పవన్ కళ్యాణ్, బాలకృష్ణ - రవితేజ, రానా - వెంకటేష్ ఇలా చాలామంది హీరోలు విక్రమ్ వేద సినిమాని రీమేక్ చేయబోతున్నారనే గాసిప్స్ వినిపించాయి. ఇప్పుడు లేటెస్ట్ గా ఈ విక్రమ్ వేద రీమేక్ లిస్ట్ లో చిరు - నాగ్ పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. చిరంజీవి - నాగార్జున విక్రమ్ వేద రీమేక్ చేస్తున్నారని.. మాధవన్ కేరెక్టర్ లో నాగార్జున, విజయ్ సేతుపతి కేరెక్టర్ లో చిరుని ఊహించేసుకుంటున్నారు ఫాన్స్.
మరి చిరు - నాగ్ మంచి స్నేహితులు. వాళ్ళ అనుబంధం అందరికి తెలిసిందే. వీళ్ళిద్దరూ విక్రమ్ వేద రిమేక్ చేస్తే అంతకన్నా హ్యాపీ అయిన విషయం మరొకటి ఉండదు. విక్రమ్ వేద గా నాగ్ - చిరు ల ఫ్యాన్ మెడ్ పోస్టర్ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.