Advertisementt

ఎట్టకేలకి వెనక్కి తగ్గిన జగన్ రెడ్డి

Sun 02nd May 2021 06:39 PM
ap,inter exams,postponed,cm jagan,minister adimulapu suresh,10th exams  ఎట్టకేలకి వెనక్కి తగ్గిన జగన్ రెడ్డి
AP Intermediate 1st and2nd year exams postponed ఎట్టకేలకి వెనక్కి తగ్గిన జగన్ రెడ్డి
Advertisement
Ads by CJ

గత పది రోజులుగా ఏపీలో పది, ఇంటర్ పరీక్షల నిర్వహణలో ఏపీ ప్రభుత్వం మొండి వైఖరితో విద్యార్థుల ప్రాణాలని పణంగా పెడుతున్నారని, ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నా, పేరెంట్స్ గోల పెడుతున్నా.. కుదరదు విద్యార్థుల భవిష్యత్తు దృష్యా పరీక్షలు నిర్వహించాల్సిందే అంటూ జగన్ తో పాటుగా, విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ చెబుతున్నారు. హై కోర్టు చెప్పినా జగన్ రెడ్డి తగ్గేదే లే పరీక్షలు నిర్వహిస్తామని ఖరాఖండిగా చెప్పడమే కాదు.. హల్ టికెట్స్ వెనుక భగంగంలో కోవిడ్  జాగ్రత్తలను ముద్రించింది. 

కోర్టు చెప్పినా ఏపీ ప్రభుత్వం లెక్కలోకి తీసుకోవడం లేదు, కోర్టు మాట వినని జగన్ అనుకున్నారు. కానీ నేడు ఆదివారం ఇంటర్ పరీక్షలను వాయిదా వేస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల ఆరోగ్యం దృష్యా ఇంటర్ పరీక్షలని నిర్వహించలేకపోతున్నామని, అందుకే వాయిదా వేస్తున్నామని, ఐదో తేదీ నుంచి జరగాల్సిన ఇంటర్ పరీక్షలు వాయిదా వేస్తున్నట్లుగా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. విద్యార్థుల ఆందోళన, తల్లితండ్రుల భయాల మధ్యన పరీక్షలు వాయిదా వేస్తున్నట్టుగా ఆదిమూలపు సురేష్ ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు. ఇక పది పరీక్షలు వచ్చే నెల అంటే జూన్ లో జరగాల్సి ఉంది. ప్రస్తుతం వాటి విషయంలో మాత్రం ఎలాంటి నిర్ణయాన్ని ప్రభుత్వం ప్రకటించలేదు.

AP Intermediate 1st and2nd year exams postponed:

AP Inter exams postponed

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ