తమిళనాట అన్నాడీఎంకే పార్టీ ఓడిపోయి డీఎంకే పార్టీ అధినేత స్టాలిన్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించబోతున్నారు. ఎన్నో ఏళ్లగా కరుణానిధి జయలలితపై చెయ్యి సాధించడానికి నానా పాట్లు పడ్డారు. ఆయన కుమారుడు స్టాలిన్ అసంబ్లీ ఎన్నికల్లో పడుతూ లేస్తూ అమ్మపై చెయ్యి సాధించడానికి నానా కష్టాలు పడ్డారు. ఇక జయలలిత ముఖ్యమంత్రి గా కన్నుముయ్యడంతో ఆమె స్థానంలో పళని స్వామి సీఎం అయ్యాడు. అన్నాడీఎంకే కి అమ్మ జయలలిత మరణం కలిసోచ్చింది. మళ్ళీ ఈసారి అన్నాడీఎంకే కే ప్రజలు పట్టం కడతారని డిసైడ్ అయిన టైం లో కరుణానిధి కూడా అనారోగ్యంతో కన్నుమూశారు.
కరుణానిధి మరణంతో డీఎంకే కి సింపతీ క్రియేట్ అయ్యింది. స్టాలిన్ ఎప్పటిలాగే ప్రజలతో మమేకమై, ప్రజలకు దగ్గరగా ఉండడం, ఈ ఎలక్షన్స్ లో గెలుపు సాధించాలనే కసితో స్టాలిన్, డీఎంకే నేతలు కష్టపడ్డారు. చివరికి ఈ అసంబ్లీ ఎన్నికల్లో డీఎంకే విజయ సాధించింది. అనుకున్నట్టే తమిళ ప్రజలు సెంటిమెంట్ కి ఓటేశారు. అటు అమ్మ పార్టీలో రాజకీయ వారసుడు లేకపోవడం, సెంటిమెంట్ ని క్యాష్ చేసుకునే క్యాండెట్ లేకపోవడం స్టాలిన్ కి కలిసొచ్చింది. అన్నాడీఎంకే మీద స్వల్ప ఆధిక్యంతో స్టాలిన్ సీఎం స్థానాన్ని అధిష్టించబోతున్నారు. అదే గనక జయలలిత బ్రతికున్నా స్టాలిన్ సీఎం అయ్యేవాడు కాదు. పోనీ అమ్మ చనిపోయింది అంటే కరుణానిధి బ్రతికున్నా అన్నాడీఎంకే కి అమ్మ మరణం కలిసొచ్చేది. కానీ ఇప్పుడు అమ్మ లేదు, కరుణానిధి లేకపోవడంతో స్టాలిన్ సీఎం కాగలుగుతున్నాడు.