నాగార్జున సాగర్ ఉప ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. కాంగ్రెస్ నుండి జానా రెడ్డి, టీఆరెస్ నుండి నోముల భగత్, బిజెపి లు పోటీపడితే.. ఈ ఉప ఎన్నికల్లో టీఆరెస్ అభ్యర్థి నోముల భగత్ విజయ్ సాధించారు. నోముల భగత్ కి 74, 726 ఓట్లు రాగా.. కాంగ్రెస్ అభ్యర్థి జానా రెడ్డి 59, 239 ఓట్లతో రెండో స్థానంలో నిలవగా బిజెపి డిపాజిట్ కోల్పోయింది. నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో టీఆరెస్ అభ్యర్థి గెలుపొందడంతో సీఎం కేసీఆర్ నాగార్జున సాగర్ ప్రజలకి కృతఙ్ఞతలు తెలియజేసారు.
గెలిచిన టీఆరెస్ అభ్యర్థి నోముల భగత్ నాగార్జున సాగర్ ప్రజలకి తనకి ఓటు వేసిన ప్రతి ఒక్కరికి, తనని గెలిపించిన టీఆరెస్ ఎంపీ, ఎమ్యెల్యేలకి పేరు పేరునా కృతఙ్ఞతలు తెలియజేసారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కి భగత్ ధన్యవాదాలు తెలిపారు.