కరోనా ఉధృతి పెరిగి పోతుంది. పలు రాష్ట్రాల్లో కరోనా కట్టడి చెయ్యలేక లాక్ డౌన్ విధిస్తున్నాయి ఆయా ప్రభుత్వాలు. దేశ ప్రధాని కరోనా కట్టడిలో విఫలమయ్యారంటూ నరేంద్ర మోడీ ని రిజైన్ చేయాలంటూ నెటిజెన్స్ పెద్ద ఎత్తున #ResignModi అనే హాష్ టాగ్ ని ట్రెండ్ చేస్తున్నారు. అయితే పలు రాష్ట్రాల్లో కరోనా కట్టడిలో భాగంగా లాక్ డౌన్స్, నైట్ కర్ఫ్యూలు పెట్టినట్లుగా.. ఒడిశా ప్రభత్వం ఈ రోజునుండి మే 14 వరకు అంటే 14 రోజులు లాక్ డౌన్ పెడుతున్నట్టుగా ప్రకటించింది.
ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్.. ఒడిశాలో లాక్ డౌన్ పెడుతున్నామని, రోజు వారి కేసులు ఐదు వేలకి మించిపోవడంతో.. లాక్ డౌన్ విధిస్తున్నామని, లాక్ డౌన్ సమాయంలో ఆంక్షలు కఠినంగా ఉంటాయని, ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో బయటికి రావొద్దు అని, ప్రజా రవాణా వ్యవస్థనూ బంద్ పెడుతున్నట్టు చెప్పిన ఒడిశా ప్రభుత్వం నిత్యవసరాలను కొనుగోలు చేసేందుకు అనుమతులిచ్చినా, ఆంక్షలు పెట్టింది. ఉదయం 6 గంటల నుండి మధ్యాన్నం 12 గంటలలోపే నిత్యావసర సరుకులు కొనుగోలు చేసుకోవాలని అంటూ ప్రకటించింది ఒడిశా ప్రభుత్వం.