టాలీవుడ్ హీరోల్లో పవన్ కళ్యాణ్ కి అభిమాన గణం చాలా ఎక్కువ. పవన్ కళ్యాణ్ అంటే ప్రాణం పెట్టే ఫాన్స్ ఆయన్ని ఎవరైనా అవమానించారని తెలిస్తే వాళ్ళని అస్సలు వదిలిపెట్టారు. గతంలో కత్తి మహేష్ పవన్ కళ్యాణ్ ని కామెంట్ చేసిన పాపానికి అలాగే వెంటాడారు పవన్ ఫాన్స్. ఇక తాజాగా అనుపమ చేసిన చిన్న తప్పిదానికి అనుపమ పరమేశ్వరన్ కి చుక్కలు చూపించారు ఫాన్స్. అదేమిటంటే పవర్ స్టార్ పవన్ తాజా చిత్రం వకీల్ సాబ్ ని రీసెంట్ గా ఓటిటిలో వీక్షించిన అనుపమ పరమేశ్వరన్.. ఆ సినిమాలో నటించిన అంజలి, నివేత థామస్ అనన్యాలు అదరగొట్టారని.. ప్రకాష్‌రాజ్‌ను సార్ మీరు సూపర్ అంటూ అందరిని పేరు పేరునా సంభోదించిన అనుపమ పవన్ కళ్యాణ్ గురించి అస్సలు మాట్లాడకుండా.. జస్ట్ ట్విట్టర్ ఐడి ని టాగ్ చేసింది.
పవన్ కళ్యాణ్ నటనని కానీ, ఆయన్ని కానీ మెచ్చుకొని కారణంగా పవన్ కళ్యాణ్ ఫాన్స్ రెచ్చిపోయి.. పవన్ కళ్యాణ్ కి రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకో ఫస్ట్ అంటూ అనుపమని సోషల్ మీడియాలో ఆడుకోవడం స్టార్ట్ చేసారు పవన్ ఫాన్స్. దానితో వెంటనే అనుపమ పరమేశ్వరన్ లైన్ లోకి వచ్చి తను రియలైజ్ అయినట్లుగా పేర్కోంటూ సారీ చెప్పడమే కాదు.. మరోక ట్వీట్‌లో పవన్ కళ్యణ్ గారు.. అంటే ఎంతో గౌరవం, ప్రేమ అని ట్వీట్ చేసింది. దెబ్బకి దిగొచ్చి సారి చెప్పేసరికి పవన్ ఫాన్స్ శాంతించి అనుపమని ట్రోల్ చెయ్యడం ఆపేసారు.