దేశం మొత్తం కరోనా అల్లకల్లోలంలో కొట్టుకుపోతుంది. ఢిల్లీ, మహారాష్ట్ర, తెలంగాణ, మధ్య ప్రదేశ్, ఏపీ, యుపి ఇలా ఏ రాష్ట్రం చూసినా కరోనా కల్లోలమే. ఇలాంటి టైం లో సినిమాలన్నీ వాయిదా పడినా సల్మాన్ మాత్రం రంజాన్ కానుకగా రాధే మూవీని వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేస్తున్నాడు. ఒకేసారి ఓటిటి అలాగే థియేటర్స్ లో సల్మాన్ ఖాన్ రాధే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. రాధే అడ్వాన్స్ బుకింగ్ కూడా ఓపెన్ అయినట్లుగా సల్మాన్ ట్వీట్స్, మూవీ టీం ప్రమోషన్స్ మంచి జోరుగా సాగుతున్నాయి. టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సీటిమార్ సాంగ్ తో రాధే పై తెలుగులోనూ హైప్ క్రియేట్ చేసిన సల్మాన్ ఖాన్ మే 13 న రంజాన్ కానుకగా అభిమానుల్లో జోష్ పెంచబోతున్నాడు.
మహారాష్ట్రలో మహా జనతా కర్ఫ్యూ నడుస్తుంది. అక్కడ థియేటర్స్ మూతపడ్డాయి. అయితే మే 13 నాటికీ థియేటర్స్ ఏమైనా ఓపెన్ చేస్తారేమో. అంతకు ముందే సల్మాన్ ఖాన్ మాత్రం సినిమా ని సోషల్ మీడియాలోనే తెగ ప్రోమోట్ చేస్తున్నారు. స్పెషల్ సాంగ్స్ వదలడం, టీజర్, ట్రైలర్ ఇలా సినిమాపై అంచనాలతో పాటుగా మార్కెట్ లో మంచి బజ్ ఉంది. అయితే ఇంత కరోనా సిట్యువేషన్ లో సల్మాన్ చాలా ధైర్యంగా ముందడుగు వేస్తున్నాడని చెప్పాలి.