మహేష్ బాబు - త్రివిక్రమ్ కాంబోలో దాదాపుగా 11 ఏళ్ళ తర్వాత మూవీ రాబోతుంది. ఖలేజా తర్వాత మహేష్ - త్రివిక్రమ్ కాంబో యాడ్ షూట్ లో కలిసి చెయ్యడం తప్ప సినిమా చేసింది లేదు. కానీ ఇప్పుడు మహేష్ SSMB28 కి త్రివిక్రమ్ డైరెక్టర్ గా ఫిక్స్ అవడమే కాదు.. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో మహేష్ - త్రివిక్రమ్ మూవీ త్వరలోనే మొదలవుతుంది.. సినిమా 2022 సమ్మర్ లో రిలీజ్ అంటూ బిగ్ ఎనౌన్సమెంట్ ఇచ్చేసారు. ఇక సినిమాకి పని చేసే హీరోయిన్ కానీ, మ్యూజిక్ డైరెక్టర్ విషయాన్నీ ఎక్కడా ప్రస్తావించలేదు. అయితే త్రివిక్రమ్ - మహెష్ కాంబో మూవీ అనౌన్సమెంట్ వీడియో కి థమన్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చాడు.
ఇప్పుడు మహేష్ SSMB28 కి థమన్ మ్యూజిక్ డైరెక్టర్ గానే పనిచేస్తాడని.. త్రివిక్రమ్ ఇప్పటికే ఫిక్స్ అయినట్లుగా తెలుస్తుంది. అలా వైకుంఠపురములో తర్వాత మళ్ళీ త్రివిక్రమ్ థమన్ మ్యూజిక్ కే ఇంపార్టెన్స్ ఇస్తాడని తెలిసిన విషయమే. అయితే ప్రస్తుతం మహేష్ సర్కారు వారి పాటకి కూడా థమన్ మ్యూజిక్ డైరెక్టర్. మరి మహేష్ మళ్ళి థమన్ ని రిపీట్ చేద్దామంటాడో.. లేదంటే దేవిని లైన్ లోకి తీసుకొస్తాడో.. కాదు మణిశర్మ ని తీసుకుంటారో.. అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ అయినా.. థమన్ కే ఎక్కువగా SSMB28 మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేసే ఛాన్సెస్ ఉన్నాయి.